Recents in Beach

డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ముందు తెలుసుకొని జీవించు.Know and live before money is important and life is important.






ఈ రోజుల్లో చాలా మంది డబ్బు కోసం పరుగు పెడుతున్నారు.ఈ డబ్బుకోసం ప్రాణం పోతున్నా పట్టించుకోవట్టం లేదు
డబ్బు శాశ్వితం అని నమ్ముతున్నారు కాని ప్రాణం శాశ్వితం ( ముఖ్యం ) అని నమ్మటం లేదు.చదువుకో లేని వారు అలానే ఉన్నారు.చదువుకొని విద్య, బుద్దులు నేర్చిన వారుకూడ అలానే ఉన్నారు.

అలాగే ఈ రోజులో మనిషి 60 సంవత్సరాలు కంటే ఎక్కువ బ్రతుకలేఖ పోతున్నారు,ఇంక మహా అయితే 70 సంవత్సరాలు వరకు బ్రతకగలుగుతు ఉన్నారు.దానికి కారణం తినే సమయంలో సరిగ్గా తినకపోవటం.మనకు 30 సంవత్సరాల లోపు మనకు సరిగ్గా తినకపోయిన ఏమి కాదు కారణం మనకు ఇమ్యునిటి ఎక్కువగా ఉంటుంది.30 సంవత్సరాలు వచ్చాక ఇమ్యునిటి తగ్గుతుంది అందువల్ల చాల హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి.దీనికి తోడూ అనారోగ్య సమస్యలు వచ్చిన అంతగా పట్టించుకోము డబ్బు కోసం పరుగు పెడుతూ వుంటాం కాబట్టి దీనికి సంబంధించి ఒక కదా చెపుతా...

Read more : YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి..

ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉండేవాడు.ఆ కొడుకు ప్రతిరోజు బడికి వెళ్లి వచేటప్పుడు ఒక పెద్ద బంగ్లా ( ఇల్లు ) ప్రతిరోజు చూస్తూ ఉండేవాడు.ఒకరోజు తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఈ పెద్ద బంగ్లా ఎవరిది అని అడిగాడు అప్పుడు తండ్రి దానికి సమాధానం ఇలా చెప్పాడు.ఈ బంగ్లా ఒక పెద్ద ధనికుడిది అనిచెప్పి ఆయన బాగ చదువుకొని బాగా సంపాదించాడు.అతనికి చాల వ్యాపారాలు కుడా ఉన్నాయి అని బదులు ఇచ్చాడు.అంటే కాకుండా ఆ బంగ్లా చాల ఖరీదు కలది అని లోపల చాల విలువైన ఫర్నిచర్ ఉంది అని చెప్పాడు.ఇప్పుడు అతను లేడు షుగర్ వ్యాదితో చనిపోయాడు అని చెప్పాడు.

ఆప్పుడు ఆకుర్రవాడు ఆలోచించటం మొదలు పెట్టాడు అటువంటి బంగ్లా తను కుడా ఒకటి కాటాలి అని అనుకున్నాడు.బాగా చదువుకున్నాడు అనారోగ్య పాలైన చదువుని మాత్ర విడిచి పెట్టేవాడు కాదు.పట్టణానికి పోయి మరి పెద్ద చదువు చదువుకున్నాడు,అలాగే పట్టణంలో మంచి ఉద్యోగం లక్షల్లో సాలరి అంత బాగానే ఫ్రెండ్స్ తో జలసాలు,ఒక్కడే ఉండటం వల్ల బయటి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు.ఆనారోగ్యాన్ని కుడా లెక్కచేయకుండా డబ్బులు బాగా సంపాదించాడు.తన సొంత గ్రామానికి వచ్చాడు.తాను చిన్నపుడు అనుకున్నట్లు తను చుసిన బంగ్లా కంటే మంచి,పెద్ద బంగ్లా కట్టాడు.గృహప్రవేశం రోజు ఉరి వారికి చాల గ్రాండ్ గ భోజనం పెట్టాడు.ఉరివాళ్ళు అతని గూర్చి చాల మంచిగా మాట్లాడారు.పాలనా ఆయన కొడుకు బాగ సంపాదించాడు అని అతన్ని మాటలతో ముంచేశారు.

Read more : గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..

ఇంట్లో గృహప్రవేశం ముగిసింది ఆరోజు రాత్రి అతను ఒంటరిగా పడుకున్నాడు నిద్రలో అతనికి ఒక శబ్దం వినిపించింది అది " ఇక సెలవు నేను వెళ్లి వస్తాను " అని.అతను ఒక్కసారిగ ఉల్లిక్కిపడి పైకి లేచి కూర్చున్నాడు.ఎవరు అని అటు ఇటు చూసాడు.అతని ప్రాణం నేను అంది అతను ఎందుకు అలా అన్నావ్ అని అడిగాడు.అవును నువ్వు విన్నది నిజమే " ఇక సెలవు నేను వెళ్లి వస్తాను " అని రెండవసారి అంది ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు.నాకు ఇల్లు నచ్చలేదు అని చెపింది.అందరు నేను కట్టించిన ఇల్లు గురించి చాల గొప్పగా మాట్లాడుకుంటున్నారు.నీకు ఎందుకు నచ్చలేదు అని అడిగాడు.

నేను మాట్లాడేది నువ్వు కట్టించిన ఇల్లు గురించి కాదు.నీ శరీరం గురుంచి ( బాడి ) అది చాల రకాల వ్యాదులతో నిండి ఉంది.అల్సర్,షుగర్,బిపి, ఇంక చాల రాకాల రోగాలతో నిండి ఉంది నీ శరీరం నేను ఈ వ్యాదుల మద్య ఉండలేక పోతున్నా అందుకే వెళ్ళిపోతున్నఅని చెప్పి వెళ్ళిపోయింది.అతను చనిపోయాడు.

నీతి : ఈ కధలో చెప్పిన విధంగా మన పరుగు పెడుతున్నది డబ్బుకోసమా,ఆరోగ్యం కోసమా మీరే ఆలోచించండి. 


ఈ క్రిందివి కుడా చదవండి :

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ స్టలాలు పొందటానికి మీరు అర్హుల కాదా ఎల తెలుసుకోవాలి.

 గ్రామ సచివాలయం ద్వార మన  రేషన్ కార్డులో పేరు తొలగించటం ఎల.

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..