ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుండి బ్యాంకింగ్ సవరణ చట్టంలో కొత్త మార్పులను తీసుకువచ్చింది. మొత్తం 19 సవరణలు చెయ్యటం జరిగింది. అందులో ఇది ఒకటి. బ్యాంకు ఖాతాదారులు మరియు డిపాజిటర్లు ఇకపై నలుగురు అభ్యర్థులను నామినీలుగ ( Nominee ) పెట్టుకోవచ్చు. అలాగే ఖాతాదారు మరణాంతరం ఈ నామినీలకు ఎంత శాతాన్నిఖాతాలో వాటా చెందాలి అనేది కూడా ముందుగ పేర్కొనవచ్చు. బ్యాంకు లాకర్ల విషయంలో కుడా ఒకే విడత ఈ నలుగురిని కాకుండా ఒకరి తరువాత ఒకరు నామినీనీ ( Nominee ) వచ్చేలా నమోదు చేసుకోవచ్చు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో TET 2025 Notification విడుదల.
ఈ సవరించిన నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా డిపాజిటర్లు మరియు బ్యాంక్ ఖాతాదారులు ఇక నలుగురిని నామినీగ పెట్టుకునే అవకాశం ఉంది. వారి మరణానంతర ఖాతాలో సొమ్ము చెల్లింపు సమయంలో వారు చెల్లించాల్సిన శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగురు భద్రతా లాకర్ల విషయంలో పై చెప్పినట్లు కుడా అమలవుతుంది.
$ads={1}
డిపాజిటర్ మరణం తరువాత క్లెయిమ్ ఎలా.
మీరు ఎంత శాతం వాటా కేటాయించాలనుకుంటున్నారో అది ఖతాదారునిపై ఆధారపడి ఉంటుంది. ఒకే విడత ను నలుగురు నామినీలు లేదా ఒకరి తరువాత ఒకరు వచ్చేలా ప్రతిపాదించవచ్చు. సేఫ్టీ లాకర్లలో ఉంచిన వస్తువులను నాలుగు విడతల్లో కాకుండా నామినీ-వర్తించదగిన పద్ధతిలో ఒకదాని తరువాత ఒకటిగా నమోదు చేయవచ్చు.మొదటి మరణం తరువాత మాత్రమే రెండవ నామినేషన్ అమలులోకి వస్తుంది.
ఎందుకు ఈ సవరణ చేశారు.
మనం ఒకరిని మాత్రమే నామినీని పెట్టినట్లయితే ఖాతాదారు చనిపోయినప్పుడు ఖాతా సోము చెల్లించే సందర్భంలో ఆ ఒక్కరు ఆ ఒక్క నామినీ చాలా సందర్భాలలో అందుబాటులో ఉండట్లేదంటా అందుకే ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనల అమలు డిపాజిటర్లకు నామినీలకు సులభతరం చేస్తుంది. అలాగే ఖాతాదారుడు ఈ నామినీ వ్యక్తులను వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నామినేట్ చేయవచ్చు. పర్యవసానంగా, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ల పరిష్కారం విషయంలో పారదర్శకత, సమర్ధత, ఏకరూపత కలిగి ఉంటుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
$ads={2}
Also Read: పెన్షన్ తీసుకునే వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.
For more Updates Click and Join Us:





కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!