Cyber Crime Alert: పెన్షన్ తీసుకునే వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.



పోలీస్ కమిషనర్, సైబర్ క్రైమ్ సెల్, లక్నో పరిధిలో జరిగిన సంఘటన.

"పెన్షన్ తీసుకునే వృద్ధులకు హెచ్చరిక" పెన్షన్ హోల్డర్లను మోసం చేయడానికి సైబర్ నేరస్థులకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు".

Also Read: APAAR కార్డు కోసం ఆన్లైన్ లో ఎల అప్లై చెయ్యాలి.

సైబర్ నేరస్థులు ఇప్పుడు ఏంచేస్తున్నారు అంటే తమ "లైఫ్ సర్టిఫికేట్" ను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి పెన్షనర్లను సంప్రదిస్తున్నారు. వారి నియామకం మరియు పదవీ విరమణ తేదీలు, పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ ( PPO ) నంబర్ ఆధార్ కార్డ్ నంబర్, శాశ్వత చిరునామా, ఇమెయిల్ చిరునామా, పదవీ విరమణ మొత్తం నెలవారీ పెన్షన్, నామినీ మరియు మరెన్నో  పెన్షనర్ల మొత్తం సమాచారాన్ని వారు ఫోన్ ద్వార అడిగి తెలుసున్తున్నారు.

$ads={1}

వారు ఈ సమాచారంతో కాల్ చేసి, వారు మేము పెన్షన్ డైరెక్టరేట్కు ( Pension Directorate ) నుండి పెన్షనర్ను ఒప్పిస్తారు. పెన్షనర్ నమ్మి వారి మొత్తం సమాచారాన్ని అందిస్తారు మరియు వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని( Life Certificate ) నవీకరించడానికి ( For Revival ) కోసం అని ఓటిపిని ( One Time Password - OTP ) అడుగుతారు. పెన్షనర్ తమ ఫోన్లో అందుకున్న ఓటిపిని వాళ్లకు చెప్పిన తర్వాత, మోసగాళ్లకు వారి బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ గ యాక్సెస్ పొందుతారు. అప్పుడు పెన్షనర్ ఖాతాలో జమ చేసిన నిధులన్నీ ( Money ) ఇతర నకిలీ వాలెట్లు లేదా బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు.

$ads={2}

మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, పెన్షన్ డైరెక్టరేట్ ( Pension Directorate )  ఏ పెన్షనర్లకు జీవిత ధృవీకరణ పత్రాలను ( Life Certificate ) కాల్ చెయ్యదు లేదా నవీకరించదని ( For Revival ) తెలుసుకోండి. పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను నవీకరించడానికి వ్యక్తిగతంగా పెన్షన్ డైరెక్టరేట్ను వెళ్ళే ఏదైనా పని చేసుకోవాల్సి ఉంటుంది. మోసపూరిత కాల్స్ జాగ్రత్త వహించండి. మరియు మీకు కనుక ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే Indian Cyber Crime Coordination Centre " 1930 " కి కాల్ చేయండి. అలాగే సైబర్ క్రైమ్ వెబ్సైటు https://www.cybercrime.gov.in లో కంప్లైంట్ చెయ్యండి.

Note: ఈ సమాచారాన్ని మీ కుటుంబంలోని పెద్దవారికి, రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి షేర్ చేయండి.
                               " మీ జాగ్రత్తే మీ డబ్బును కాపాడుతుంది. "



Also Read: రైల్వేలో 8,850 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

For more Updates Click and Join Us:


    


Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది