హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత పధకానికి సంబంధించి మనకు బ్యాంకు ఎకౌంటులో డబ్బులు పడ్డాయో లేదో ఎల తెలుసుకుందాం.దీనికంటే ముందు అసలు ఈ " వైఎస్ఆర్ చేయూత పధకం " యొక్క మెయిన్
ఉదేశం ఏమిటో తెలుసుకుందాం.
వైఎస్ఆర్ చేయూత పధకం ముఖ్య ఉదేశo :
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తను పాద యాత్ర చేస్తున్నపుడు ఎవరైతే అక్క,చెల్లెమ్మలు 45-60 వయసు సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి రూ. 18,750 /- వారి యొక్క బ్యాంకు ఖాతాకు ప్రతి ఒక్కరికి ఇస్తాను అని చెప్పటం జరిగింది. అలాగే ఇది నాలుగు సంవత్సరాలు ( 4 సంవత్సరాలకు కలిపి మొత్తం రూ 75,000 ) వారి బ్యాంకు ఎకౌంటులో జమ చేస్తాను అని చెప్పటం జరిగింది.దీనిని ఈనెల అంటే 12 ఆగస్ట్ 2020 న ప్రారంభిచటం జరిగింది.వైఎస్ఆర్ చేయూత పధకం అర్హతలు :
- మొత్తం కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతంలో అయితే నెలకు రూ.12,000 /- గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.10,000 /- కంటే తక్కువ ఉండాలి.
- మొత్తం కుటుంబంలో భూమి మాగాణి 3 ఎకరాలు ,మెట్ట 10 ఎకరాలు మించి ఉండకూడదు మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 మించి ఉండకూడదు.
- కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్సన్ దారులై ఉండకూడదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు )
- కుటంబం నివసిస్తున్న గృహం ( సొంతం / అద్దె ) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం బిల్లు ౩౦౦ లోపు ఉండవలెను.( గత 6 నెలల విద్యుత్ వినియోగం యొక్క సగటు ౩౦౦ యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను )
- పట్టణ ప్రాంతంలో నిర్మాణంపు స్తలం 10,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండవలెను.
- కుటుంబ సభ్యులలో ఎవరికైన 4 వీలర్ సొంత వాహనంమై ఉండకూడదు,ఒకవేళ సొంత వాహనం ఉంటే ఆటో,టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు.
- కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండకూడదు.
- ఆధర్ కార్డు కలిగి ఉండవలెను.
- ప్రభుత్వం జారి చేసిన కుల ద్రువీకరణ పత్రం ( SC,ST,BC మరియు Minority ) ఉండవలెను.
ఈ డబ్బులు సొంత ఖర్చులకు వాడవచ్చు :
ఈ డబ్బులను సొంతానికి వాడుకోవటం వల్ల వెంటనే ఖర్చు అవుతాయి కాబట్టి మన ప్రభుత్వం వీటిని మీరు ఏమైనా సొంత వ్యాపారం ప్రరంబించుకోండి అని చెప్పటం జరిగింది.వైఎస్ఆర్ చేయూత పధకం :
ఈ పధకానికి అర్హత కలిగిన వారికి వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయటం జరిగింది.ఈ పధకాన్ని 12 ఆగష్టు 2020న ప్రారంబించారు.ప్రారంబించిన తరువాత అందరికి బ్యాంకు ఖాతాలో పధకానికి సంబంధించిన డబ్బులు జమ చేయటం జరిగింది.వారి ఖాతాలో డబ్బులు జమ అయయో లేదో తెలుసుకోవాలి అంటే మీ బ్యాంకుకు ఒక మిస్డు కాల్ నెంబర్ ఉంటుంది.దానికి మీరు కాల్ చేస్తే కాల్ కట్ అయి మీ మొబైల్ కి మీ బ్యాంకు బాలన్స్ మెసేజ్ వస్తుంది.ముందు మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి.మీ చేసి బాలన్స్ ఎక్కువ చూపిస్తే మీకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు జమ అయినట్లే.దీనికి సంబంధించి కొన్ని బ్యాంకుల మిస్డు కాల్ నెంబర్ క్రింది ఉన్నాయి ఒక్కసారి ప్రయత్నించండి.
( గమనిక : మీ బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి మిస్డు కాల్ నెంబర్లు నిజమో కాదో తెలుసుకోండి )
బ్యాంకు కాల్ చేయవసిన నెంబర్
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 092237666666, 1800112211సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా 9555244442
పంజాబ్ నేషనల్ బ్యాంకు 18001802222, 18001802223, 01202303090
యాక్సెస్ బ్యాంకు 18004195959
కెనర బ్యాంకు 09015483483, 09015734734
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 7039035156
దేనా బ్యాంకు 09278656677, 09289356677
బ్యాంకు అఫ్ ఇండియా 9015135135
ఐసిఐసిఐ బ్యాంకు 9594612612
ఇండియన్ బ్యాంకు 9289592895
ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ 08067205757
హెచ్ డి యఫ్ సి బ్యాంకు 18002703333, 18002703355
కార్పొరేషన్ బ్యాంకు 9268892688
యు కో బ్యాంకు 9278792787
యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా 09015431345
బ్యాంకు అఫ్ మహారాష్ట్ర 9222281818
ఐడిబిఐ బ్యాంకు 18008431122
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా 09223008586
బ్యాంకు అఫ్ బరోడా 8468001111
అలహాబాద్ బ్యాంకు 9224150150
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు 09266921358
ఆంధ్ర గ్రామీణ వికాస బ్యాంకు 9289222024
సప్తగిరి గ్రామీణ బ్యాంకు 08572233598
పై బ్యాంకులలో మీ యొక్క బ్యాంకు లేకపోతే ఏటియం కు వెళ్లి చెక్ చేసుకోండి.ఒకవెల పైన తెలిపిన బ్యాంకు లో మీ బ్యాంకు వుండి మీకు బాలన్స్ మెసేజ్ రాకపోతే మీ మొబైల్ మీ బ్యాంకు ఎకౌంటుకి లింక్ అవ్వలేదు అని అర్ధం.
Conclusion :
వైఎస్ఆర్ చేయుత పధకానికి సంబంధించి మీ బ్యాంకు ఎకౌంటులో డబ్బులు జమ అయయో లేదో ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు.దీనికి సంబదించి ఏమైనా మీక సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.

tercapin-ji-1994 Kevin Islam https://wakelet.com/wake/VC1raYt4kF_gYb7rSi4Iv
రిప్లయితొలగించండిhuntsymwatchdrum
Mmocoil-chi1977 Tanner Young Awesome
రిప్లయితొలగించండిSoftware
oopecadhe
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!