Recents in Beach

జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.Leave the painful moments of life and only then will life be happy.

 
ఫ్రెండ్స్, మనం నిత్యజీవితంలో మన కార్యకలాపాలు చేసుకునే చోట మన ఎంతో మందితో కలిసి మాట్లాడుతూ ఉంటాము.ఆ సంధర్బంలో మనకు నచ్చని వారో లేక అనుకోకుండా ఎవరో ఒకరు ఏదో అన్నారు అనుకోండి.మనం అప్పటి నుండి చాల బాధగా వుంటాము.రోజంతా వాళ్ళు అలా ఎందుకు అన్నారు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము.ఈ మద్య కాలంలో అయితే ఇంట్లో వాళ్ళు తిట్టారు అని ఆత్మహత్య చేసుకున్నవాళ్ళ గురించి మనం వినేఉంటాం.అందరు అలా ఉండరు కొంతమంది మాత్రమే అలా ఉంటారు.


Read more : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.


ఒక్క మాట గుర్తుపెట్టుకొండి " మనలను సృష్టించిన దేవుడికే కష్టాలు తప్పలేదు మనమెంత చెప్పండి. " దేవులే అందరికి నచ్చరు మనమెంత చెప్పండి. మనం అందరికి నచ్చాలి అని లేదు కదా అటువంటి వారు మనలను ఏదో ఒకటి అంటారు దాని గురించి మనం ఎక్కువగా భాదపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక కధ నేను మీకు చెపుతాను...

ఒకాయన బ్యాంకులో డ్రా చేసుకొని ఇంటి అవసరాల నిమిత్తం 86,400 రూపాయలు తెసుకొని వెళ్తున్నాడు.అది గమనించిన దొంగ అతనిని వెంబడించి బ్యాగు గుంజుకున్నాడు ఈ క్రమంలో బ్యాగు క్రిందపడి పోతుంది,డబ్బులు చల్లా చెదురు అవుతాయి.దొంగ తనచేతికి అందిన 400 రూపాయలు తెసుకుని పారిపోతాడు.తరువాత ఆ డబ్బుల యొక్క యజమాని డబ్బులను ఏరుకుని లేక్కపెట్టుకుంటాడు మొతం 86,000 రూపాయలు ఉంటాయి.అంటే 400 రూపాయలు దొంగ దొంగిలించాడు అని అనుకుంటాడు.అయినా అది నేను కష్టపడి సంపాదించిన డబ్బులు అని 400 దొంగిలించిన దొంగపై కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళతాడు.


Read more : వైఎస్ఆర్ చేయూత పధకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.


పోలీస్ వారు కంప్లైంట్ ఇస్తాడు కోర్టులో వాదించటానికి లాయర్ని కలుస్తాడు లాయర్ మొత్తం ఫీజు అంత కలిపి 86,000 రూపాయలు అవుతుంది అని చెపుతాడు.ఇప్పుడు చెప్పండి 400 రూపాయల కోసం  86,000 రూపాయలు కర్చుపెట్టటం ముక్యమా,లేక 400 రూపాయలే కదా అని వదులుకోవటం ముక్యమా మీరే చెప్పండి.మీరు 400 రూపాయలు వదులుకోవటం మంచిది అని అంటారు కదా.నేను కుడా అంతే...

చుడండి ఫ్రెండ్స్ , మనకు రోజులో మొత్తం 24 గంటలు 24 గంటలకు మొత్తం 86,400 సెకండ్స్ అందులో 400 సెకండ్స్ అంటే 4 నిమిషాలు అనుకోండి.ఇప్పుడు కధలోకి వెళదాం రోజులో 86,000  సెకండ్స్ మన దగ్గర వున్నయి అది మానేసి 400 రూపాయలు పోయాయి అంటే 4 నిముషాలు ఎవరో ఏదో అన్నారు అని చెప్పి 86,000 సెకండ్స్ బాధ పడటం ముఖ్యమా లేక 400 రూపాయల లాగ 4 నిమిషాలు మనలను భాద పెట్టిన వారిని మరిచిపోవటం ముఖ్యమా మీరే చెప్పండి.

నీతి : మనం జీవితంలో మనలను భాద పెట్టిన 4 లేదా 5 నిమిషాలను మరచిపోండి.మిగిలిన నిమిషాలతో సంతోషంగా గడపండి...

ఈ క్రిందివి కుడా చదవండి : 


మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి..

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..

ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు