మహాకుంభ మేళాలో మోనాలిసా అనే చిన్నది రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మోనాలిసా చిత్రాలు, వీడియోలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీలైన చోట, మోనాలిసాను మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు యూట్యూబర్లు ఆపి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతేకాకుండా, ఆమెను ఫోటో తీయడానికి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఆమెను వ్యక్తులు, మీడియా ప్రతినిధులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమెను అక్కడి నుండి కదలకుండ మరింత విసుగు పుట్టించారు.
సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యినప్పుటి నుండి ఇటువంటి విడియోలు ఫోటోలు బాగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇటువంటి విడియోలు ఫోటోలకు వేలాది లైక్లు, షేర్లు, వ్యాఖ్యలు మరియు షేర్లతో, ఈ వీడియో సోషల్ మీడియా సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె తన లుక్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కొందరు తమ ప్రతిభ కారణంగా రాత్రికి రాత్రే ప్రముఖులు అవుతారు. అదేవిధంగ ఇప్పుడు సోషల్ మీడియా ఆమె అందం ప్రపంచమంతా ఆమెను చూసేలా చేసింది.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఆధ్వర్యంలో మహాకుంభ మేళా జరుగుతుంది. 45 రోజుల పాటు జరిగే మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగం ప్రస్తుతం అక్కడ కోట్లాది మంది భక్తులు, సాధువులకు ఇది పవిత్రమైన ప్రదేశం. ఇవన్నీఒకఎత్తు అయితే ఇప్పుడు అక్కడ మోనాలిసా అనే యువతి ఇటీవల చేసిన సోషల్ మీడియా షేక్ చేస్తుంది భారీ కుంభమేళాలో ఒక్కసారిగ తల్లుక్కున మెరిసింది.
కుంభమేళాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముతుంది.అక్కడ మోనాలిసా అందం అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా ముదురు రంగు చర్మం, పిల్లి కళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోను చిత్రీకరిస్తున్నప్పుడు, కుంభమేళాకు హాజరైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను గుర్తించి తెలుసుకోవాలని ఆమెను ప్రశ్నించారు. అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమెను సంప్రదించి ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు.
మోనాలిసా ముఖం మొదట చిరునవ్వుతో వెలిగిపోయింది, కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే ప్రజలు ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆమెను అనుసరించారు. ఇక ఆమె తను అమ్మే పూసలు, రుద్రాక్ష దండలు సరిగ్గ అమ్మలేఖ పోయింది అంతలా మీడియా వాళ్ళు ఆమెను విసుగించారు.
- Saif Ali Khan: సీసీ ఫుటేజ్ వీడియో వదిలిన పోలీసులు సైఫ్‌ను పొడిచింది ఇతనే.
- వైరల్ గర్ల్ మోనాలీసా..అందంగా ఉండటమే ఆమె తప్పా.
- AP Grama Ward Secretariats: ఏపిలో సచివాలయాల విభజ గైడ్ లైన్స్ జారీ - వాళ్లు అవుట్.
- Garikapati : గరికపాటి టీమ్ స్పందన అవన్నీ అబద్ధాలు.. క్రిమినల్ కేసులు వేస్తాం..
ఒకానొక సమయంలో తన వద్దకు వచ్చిన వ్యక్తులతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఆమె ఎక్కడికి వెళ్ళిన ముందు మోనాలిసా మైక్రోఫోన్లు, కెమెరాలు మరియు ఫోన్లను పెట్టేవారు ఆమె వాటిని పక్కకు నెట్టివేసింది. ఆమె ఎంత ఇబ్బంది పడిందో స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు ఇది మోనాలిసా బంధువులను కూడా తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు.
మహాకుంభ మేళా సమయంలో జీవనోపాధి కోసం మధ్యప్రదేశ్ నుండి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలను విక్రయిస్తుంటే తన పని చేయనియకుండ భాధ పెడుతున్నారు అని ఆమె చెప్పింది. మోనాలిసా తండ్రి పరిస్థితి చూసి చేసేదేం లేఖ ఆమెను వారి స్వస్థలమైన ఇండోర్కు పంపాడు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!