DSC Notification 2025: ఎందుకు ఏపి డిఎస్సి 2025 వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు.


  • ప్రభుత్వం Mega DSC 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
  • మరి ఆందోళన ఎందుకు ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Mega DSC 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

$ads={1}​

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: 20 ఏప్రిల్ 2025

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20 ఏప్రిల్ 2025

  • దరఖాస్తు చివరి తేదీ: 15 మే 2025

  • పరీక్ష తేదీలు (CBT): 6 జూన్ 2025 నుండి 6 జూలై 2025 వరకు

ఇంత వరకు బాగానే ఉంది.కాని నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చెయ్యాలని విద్యార్ధి సంఘాలు అంటున్నాయి. అది ఏమిటో ఇప్పడు చూద్దాం.
Also Read: 10వ తరగతి పాస్ అయినవారికి IIIT మంచి అవకాశం.

మరి ఆందోళన ఎందుకు?

విద్యార్హత (Educational Qualification):


పోస్ట్ యొక్క విషయం మరియు వర్గం ఆధారంగా కొన్ని ప్రత్యేక అర్హతలు అవసరం కావచ్చు. ఉదాహరణకు, School Assistant (Telugu) పోస్టుకు అభ్యర్థి వద్ద 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ BA,B.Ed ఉండాలి.

AP DSCలో స్కూల్ అసిస్టెంట్, SGT వంటి పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. ఇది సాధారణ అర్హతగా పరిగణించబడుతుంది.

Point No.1:

ఇంతకుముందు 50% మార్కులతో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి అనేది లేదు. డిగ్రీ అలాగే బిఇడి ఉంటే చాలు అందరు అర్హులే కాని ఇప్పుడు డిగ్రీలో ఇంత శాతం ఉండాలి అని అంటున్నారు దాని వల్ల చాల మంది విద్యార్ధులు అనర్హులు అయ్యే అవకాశం ఉంది అని అంతేకాదు విద్యార్ధు,విద్యార్ధి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపు:
SC, ST, BC, మరియు దివ్యాంగ అభ్యర్థులు ఈ విద్యార్హతలో 45% మార్కులతో అర్హత పొందవచ్చు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇవ్వబడే సడలింపు.

$ads={2}​

వయోపరిమితి (Age Limit):
AP DSC 2025 కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది సాధారణ వయోపరిమితి.

Point No.2:

మీరు ఇక్కడ గమనించినట్లైతే వయసు పరిమితి 42 సంవత్సరాలు అని ప్రభుత్వం చెప్పింది. కాని 7ఏళ్ళ తరువాత ప్రభుత్వ మళ్ళి DSC ఎక్షమ్ పెడుతుంది. దానిని 47 సంవత్సరాలకు పెంచమని విద్యార్ధు,విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ నిరసనలు చేస్తున్నారు.

చివరి మాట:

గతంలో, బ్యాచిలర్ డిగ్రీ మరియు B.Ed. అర్హతలు కలిగిన అభ్యర్థులు DSC పరీక్షకు అర్హులుగా పరిగణించబడేవారు, డిగ్రీలో పొందిన మార్కుల శాతం పరిగణనలోకి తీసుకోబడేది కాదు.

AP DSC 2025 నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు (SC/ST/BC/దివ్యాంగులకు 45%) కలిగి ఉండాలి. B.Ed. లేదా D.El.Ed. వంటి బోధనా అర్హతలు కలిగి ఉండాలి.

ఈ మార్పుల కారణంగా, గతంలో DSC పరీక్షకు అర్హులుగా పరిగణించబడిన అనేక అభ్యర్థులు ఇప్పుడు అనర్హులయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మరియు అభ్యర్థులు ఈ మార్పులపై ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యా శాఖ మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని కోరుతున్నారు.

Also Read: ఇంటర్ అర్హతతో హోమ్ గార్డ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.


Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది