Telangana SSC Results 2025: ఈ సరికొత్త ఫార్మాట్ లో రిజల్ట్స్ ప్రకటన.

 


  • తెలంగాణ పదో తరగతి ఫలితాలు.
  • ఇంటర్ సిలబస్ మార్పు తాత్కాలికంగా నిలిపివేశారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది:
ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను 

అధికారిక వెబ్‌సైట్‌:

https://bse.telangana.gov.in/

https://www.manabadi.co.in/ 

ద్వారా కూడా TS 10th Class Results 2025 చూడొచ్చు.

ఈ ఏడాది పరీక్షల వివరాలు చూస్తే, సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.వీరి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

$ads={1}

ఈసారి మార్కుల మెమోలపై ఒక కీలక మార్పు జరిగింది:
ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు ఇవ్వడం (CGPA విధానం) అమలులో ఉండేది. అయితే ఇకపై CGPA ఇవ్వకుండా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు స్పష్టంగా చూపించనున్నారు. దీనిపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మార్పుతో విద్యార్థుల ప్రతిభపై మరింత పారదర్శకమైన సమాచారం అందుబాటులోకి రానుంది.ప్రతి సబ్జెక్టులో వారు ఎంత మార్కులు సాధించారో స్పష్టంగా తెలిసే విధంగా మార్కుల మెమోలు రూపొందించబడ్డాయి. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి అవగాహన కల్పించే అవకాశం ఇస్తుంది.

Also Read: ఏపిలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల 16, 347 పోస్టులకు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మరో విశేషం ఉంది.
విద్యార్థుల సాధారణ సబ్జెక్టులతో పాటు, నాలుగు కో-కరిక్యులర్ యాక్టివిటీలకు సంబంధించిన గ్రేడ్లను కూడా మార్కుల మెమోలపై ముద్రించనున్నారు. ఈ నాలుగు విభాగాలు: వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం CBSE పద్ధతిలో కూడా సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ SSC ఫలితాల్లో కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు.

                           ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మార్పులు మరియు ఇంటర్నల్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనలకు విద్యాశాఖ నుండి ఆమోదం లభించలేదు. దీంతో తాత్కాలికంగా ఈ మార్పులు వాయిదా పడ్డాయి.


ఇంటర్‌ బోర్డు చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు ఇవే.

ఆర్ట్స్ గ్రూప్ సబ్జెక్టులు మరియు భాషా సబ్జెక్టుల్లో 20 మార్కులకు ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్‌లు ఆధారిత ఇంటర్నల్ మార్కులు ప్రవేశపెట్టాలని సూచించారు. రాత పరీక్షను 80 మార్కులకు పరిమితం చేయాలని సూచించారు. సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ఆధారంగా కొన్ని చిన్న మార్పులు చేయాలని భావించారు. కానీ విద్యాశాఖ స్పందన మిశ్రమంగా ఉండటంతో, మొత్తం మార్పు ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

$ads={2}

సంక్షిప్తంగా విశ్లేషణ:

  • పదో తరగతి ఫలితాల ప్రక్రియ క్లియర్ అయింది; ఫలితాల విడుదలకు మిగిలిన అడ్డంకులు లేవు.

  • మార్కుల మెమోలలో సబ్జెక్టులతో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీల గ్రేడ్లు కూడా చూపించనున్నారు.

  • ఇంటర్ సిలబస్ మార్పు తాత్కాలికంగా నిలిపివేశారు; పాత విధానమే కొనసాగుతుంది.

Also Read: 10వ తరగతి పాస్ అయినవారికి IIIT మంచి అవకాశం.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది