New Rent Rules 2025: ఇల్లు అద్దెకు ఇస్తున్నారా అయితే ఈ నియమాలు తప్పనిసరి.

 


Model Tendency Act 2025

కొత్త అద్దె నియమాలు 2025 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ అద్దె చట్టం ( Model Tendency Act 2025 -MTA ) ఆధారంగా రూల్స్ రూపొందించబడ్డాయి. భూస్వాములు మరియు అద్దెదారుల మధ్య వివాదాలు పారదర్శకంగా, స్పష్టంగా మరియు త్వరగా పరిష్కరించబడేలా చూడటానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.

Also Read: ఎస్ఐపీ అంటే ఏమిటి? నేను ఎలా ప్రారంభించాలి?

ఇందులో ప్రధానమైన అంశాల ఇప్పుడు చూద్దాం.

1. ముఖ్యమైన మార్పులు:

ప్రతి అద్దె ఒప్పందాన్ని రెండు నెలల్లోపు స్థానిక అద్దె అథారిటీ ( Rent Authority ) లేదా రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయాలి. జూలై 2025 నుండి డిజిటల్ స్టాంపింగ్ కూడా అవసరం కావచ్చు. రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

i) సెక్యూరిటీ డిపాజిట్:

  • ఇంతకుముందు ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు 6 నెలల అడ్వాన్సు లేదా 1 సంవత్సరం అద్దెను సెక్యూరిటీ డిపాజిట్ గ తీసుకునేవారు కాని ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ రెండు నెలల అద్దెకు పరిమితం చేయబడింది.
  • బిజినెస్ కోసం అద్దెకు ఇచ్చే స్థలాలకు అద్దె గరిష్ట అద్దె ఆరు నెలలు.
ii) అద్దె ఎప్పుడు అయితే అప్పుడు పెంచకూడదు.
  • అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచాలి.
  • అద్దె పెంచడానికి కనీసం మూడు నెలల ముందు అద్దెదారుకు వ్రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.

2. అద్దె వివాదాల పరిష్కారం.
  • అద్దెకు సంబంధించిన వివాదాలను త్వరగా పరిష్కరించడానికి అద్దె ట్రిబ్యునల్స్ మరియు అద్దె కోర్టులు స్థాపించబడ్డాయి.
  • ఈ ట్రిబ్యునల్స్ సాధారణంగా వివాదాలను పరిష్కరించడానికి అరవై రోజులు ఉంటాయి.
3. అద్దెదారుల రక్షణ కోసమే ఈ చట్టం.

యజమానుల నుండి సరైన కారణం మరియు వ్రాతపూర్వక నోటీసు లేకుండా అద్దెదారులను అకస్మాత్తుగా ఖాళీ చేయమని అడగలేము.

అద్దెదారు ఇంటి యజమాని ఖాళి చెప్పిన తరువాత కూడా ఖాళి చెయ్యకుండ నివసిస్తూ ఉంటే మొదటి రెండు నెలలు రెట్టింపు అద్దె చెల్లించిన తర్వాత నాలుగు రెట్లు అద్దె చెల్లించాలి అని ఈ చట్టం చెపుతుంది.

అద్దెకు ఇచ్చిన తరువాత ఇంటిని తనిఖీ చేయడానికి యజమానులు 24 గంటల ముందు అద్దేదారునికి నోటీసు ఇవ్వాలి.

4. మరి ఈ చట్టం వల్ల యజమానులకు ఏమిటి ప్రయోజనాలు.
  • అద్దె ఆదాయంపై టిడిఎస్ పరిమితిని పెంచడం వంటి కొన్ని పన్నుల విషయంలో ప్రయోజనాలు మరియు సరళీకరణలు ఉంటాయి.
  • అద్దెదారు సంవత్సరంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు అద్దె చెల్లించకపోతే, యజమానులు త్వరగా పరిష్కారం కోసం అద్దె ట్రిబ్యునల్ను అడగవచ్చు.
  • అద్దె ఒప్పందాలు నమోదు చేయబడితే మోసం మరియు నకిలీ డాక్యుమెంటేషన్ వల్ల సమస్యలు ఉండవు.
Note: ఈ కొత్త నిబంధనలు సమాఖ్య ప్రభుత్వ నమూనా చట్టం ఆధారంగా ఉంటాయి. అయితే, భూమి మరియు ఆస్తి చట్టాలు రాష్ట్ర సార్వభౌమత్వానికి లోబడి ఉంటాయి కాబట్టి, ప్రతి రాష్ట్రం వాటిని సరిగ్గా వర్తింపజేయాలి.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది