అన్న క్యాంటీన్లు పై ప్రభుత్వం కీలక నిర్ణయం :
నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన అల్ఫహారాన్ని ఆహారాన్ని, ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం వాటిని తీసేసి కొన్నింటిని వార్డు సచివాలయాలుగా, మరికొన్నింటిని సామాను నిల్వ చేసుకునే స్టోరేజ్ రూములుగా ఉపయోగించారు. ఆయా భవనాలు అన్నింటినీ ఇప్పుడు క్యాంటీన్లుగా మార్చేందుకు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను 10వ తేదీ లోపు పూర్తి చేసేందుకు టెండర్లను ఖరారు చేశాం.
గతంలో అక్షయపాత్ర అనే సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేది అన్న కాంటీన్. అదే విధంగ అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు అన్న కాంటీన్ కొరకు టెండర్లను స్వీకరించాం. వాటిని ఈ నెల 22న తెరుస్తున్నాం ( టెండర్స్ ). అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లో ఉంటాయి. రూ.5 కే అల్పాహారం, అలాగే రూ.5 కే భోజనం అందిస్తాం మంత్రి నారాయణ వివరించారు.
పెత్తనం వలంటీర్లదే.. వైసీపీ కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించి జనాల మీదకు ఒదిలేశారని విమర్శలు వస్తునాయి. గ్రామ, వార్డుల్లోని కుటుంబాల గుట్టును రెండున్నర లక్షల మంది వలంటీర్ల చేతిలో పెట్టి ప్రభుత్వం సినిమా చూసింది గత ప్రభుత్వం. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన వ్యవస్థను వైసీపీ కార్యకర్తల కనుసన్నల్లోకి నెట్టేశారు.
లక్ష మంది సచివాలయ ఉద్యోగులను వలంటీర్లకు రిమోట్ కంట్రోల్‌గా మార్చేశారు. నగదు పంపిణీ తప్ప ఒక్క సేవ కూడా అందించని ఈ వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దారన్న విమర్శలు వెల్లువెత్తాయి.క్లిష్టమైన కరోనా సమయంలో ఇంటింటికీ రేషన్ అందిస్తారని ఆర్భాటం చేసిన ప్రభుత్వం చివరకు పేదలను రేషన్ షాపుల ముందు క్యూల్లో నిలబెట్టింది. కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులుగా ( కొంత మంది సిబ్బందిని ) నియమించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించుకోవాల్సిన అవసరముంది అని భావిస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం.
ఈ క్రిందివి కూడా చదవండి :
తల్లికి వందనం పధకం ముఖ్య వివరాలు - Talliki Vandanam.
PM Kisan 17వ విడత డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి..
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!