Lenovo Solar Laptop: ప్రపంచంలో తోలి సోలార్ లాప్ టాప్.

 



  • ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ లాప్ టాప్.
  • బ్యాక్ అప్ ఎంతో తెలుసా..


లెనోవా నుండి కొత్త ల్యాప్టాప్ విడుదల చేయబడింది. చాలా సన్నగా ఉన్నఈ లాప్ టాప్  మొదటి సౌరశక్తితో నడిచే ల్యాప్టాప్. టెక్ రంగంలో అతిపెద్ద సమావేశాలలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ దీనిని ప్రదర్శించింది. ఈ ఈవెంట్ మార్చి 3 నుండి మార్చి 6 వరకు బార్సిలోనాలోని ఫిరా గ్రాన్ వియాలో జరుగాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సాంకేతిక వ్యాపారాలు తమ సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తాయి.

ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా:

లెనోవా యొక్క 2025 ఉత్పత్తులన్నీ ప్రత్యేకమైనవిగా పరిగణించబడుతాయి. ఇందులో లాప్ టాప్ 20 నిమిషాల సూర్యరశ్మి ఛార్జింగ్ పెట్టిన తరువాత సుమారు ఒక గంట పాటు నిరంతరం ఉపయోగించవచ్చుదీనికోసం యోగా సన్ పిసి అని పిలువబడే పరికరాన్నిఉపయోగిస్తారు. లెనోవా కంపని చెప్పిన దాని ప్రకారం ఇంటి లోపల మాత్రమే కాకుండా బయట, పార్కులలో, రహదారిపై మరియు స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాలలో కూడా పని చేయాలనుకునే వ్యక్తులకు ఇది అద్భుతమైన లాప్ టాప్. ఇది చరిత్రలో మొట్టమొదటి అల్ట్రాస్లిమ్ సోలార్ పిసి అని చెప్పవచ్చు.

$ads={1}

అదనంగా ఇది భవిష్యత్తులో సౌరశక్తితో నడిచే ఎలక్ట్రానిక్స్ పరికరాలకు మద్దతు ఇస్తుంది. అనుకోసం లెనోవా ఈ ల్యాప్టాప్ను రూపొందించింది. 84 బ్యాక్-కాంటాక్ట్ సోలార్ సెల్స్ ఉంటాయి. కన్వర్షన్ రేటు 27 శాతం సామర్థ్యంతో ఈ పరికరం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తుంది. ఇది ప్రామాణిక సిలికాన్ ఆధారిత ప్యానెల్ కంటే ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నివేదికల ప్రకారం ఇంటెల్ కోర్ అల్ట్రా CPUతో పనిచెయ్యగలదు.

MWC ఆవిష్కరించారు అని వెల్లడి అయ్యింది. ప్రతి సంవత్సరం, MWC భవిష్యత్తును రూపొందించే ఆవిష్కరణలను సూక్ష్మంగా పరిశీలించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం కన్వర్జ్  థీమ్ క్రింద నిర్వహిస్తారు . ల్యాప్టాప్ బరువు 1.22 కిలోలు మరియు 15 మిమీ మందం కలిగి ఉంటుంది.

$ads{2}

సౌరశక్తి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతున్న సమయంలో ఈ ఆలోచనతో లాప్ టాప్ ని ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని లెనోవా పేర్కొంది. అయితే ప్రొడక్షన్ అవుట్ పుట్ సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఒక వ్యాపార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే కొత్త స్మార్ట్ఫోన్లు మరియు పరికరాలను ప్రవేశపెట్టడానికి వేదికగా నిలుస్తుంది.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది