పేదలు, వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం మరో ముందుగు వెయ్యనుంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ వర్గాల కుటుంబాలకు 78,000 రూపాయల వరకు సౌర విద్యుత్ సబ్సిడీని అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద, అన్ని గృహాలు తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచితంగా విద్యుత్తును పొందగలవు.
Also Read: తక్కువ జీతంతో పొదుపు పొడుపు చెయ్యటం ఎల సాధ్యం.
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ (SC/ST) వర్గాల కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ (Solar Power) అందించే కొత్త పథకం ప్రకటించింది. ఈ సోలార్ పధకం పేరు " పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ( PM Surya Ghar Muft Bijili Yojana ) " అని పిలుస్తారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 15న ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఫలితంగా, దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.
ఈ పధకం యొక్క ప్రయోజనం: ఇంటి పైకప్పుపై ( Rooftop ) సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం మరియు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందడం దీని ప్రధాన ప్రయోజనం.
$ads={1}
ఎస్సీ/ఎస్టీ ( SC & ST ) లకు ప్రతేక ప్రయోజనం:
ఎస్సీ/ఎస్టీ అయివుండి ఆంధ్రప్రదేశ్ నివసించేవాళ్ళు ఈ క్రింది ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.జగ్జీవన్ జ్యోతి యోజన పధకంలో భాగంగా 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పైకప్పు( Rooftop ) సౌర వ్యవస్థల ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.
మహారాష్ట్ర నివసించే వారు ( Smart ): ఈ పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీ వినియోగదారులు కేంద్ర సబ్సిడీతో పాటుఅదనంగ 30% రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని పొందుతారు.
Subsidy Details ( కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ వివరాలు ).
- కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ గరిష్టంగా రూ.78,000 ఉంటుంది.
- 1-2 kW వరకు సామర్థ్యం కోసం రూ.30,000 నుండి రూ.60,000 వరకు.
- 2-3 kW వరకు సామర్థ్యం కోసం రూ.60,000 నుండి రూ.78,000 వరకు
- 3 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు గరిష్టంగా రూ.78,000 సబ్సిడీ అందుబాటులో ఉంది.
- దరఖాస్తుదారు భారతీయ పౌరుడు అయి ఉండాలి.
- ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లను అమర్చే విధంగ ఇంటిపైకప్పు ఉండాలి.
- తప్పినిసరిగ పని చేసే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
- జాతీయ పోర్టల్ https://pmsuryaghar.gov.in/ లో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
- తరువాత సౌర విధ్యుత్ పధకానికి డిస్కామ్ ( DISCOM ) ఆమోదం పొందిన తరువాత, రిజిస్టర్డ్ విక్రేత (Vendor ) సోలార్ ప్యానెల్ ( Solar Panel ) ను ఏర్పాటు చెయ్యటం జరుగుతుంది.
- ప్లాంట్ ఏర్పాటు ( Installation ) పూర్తయిన వెంటనే, సబ్సిడీ మొత్తం వెంటనే దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
- పోయిన నెల విద్యుత్ బిల్లు ( Latest Current Bill )
- ఆధార్ కార్డు.
- పాన్ కార్డు.
- ఖాతా వివరాలు లేదా బ్యాంకు పాస్ బుక్ వంటివి
- ఆస్తి యాజమాన్య రుజువు ( Property Ownership Proof ).
- దరఖాస్తుదారు యొక్క ఫోటో.
- సంస్థాపనను ఉంచాల్సిన పైకప్పు యొక్క చిత్రం ( Proposed Installation Site).

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!