How to Use Emergency Fund: అత్యవసర నిధి మనకు మన ఫ్యామిలీ కి ఏవిధంగా అవసరం అవుతుంది.



అత్యవసర నిధి ( Emergency Fund ) ఎందుకు అవసరం?

మన భవిష్యత్తు ఊహించడం కష్టం ఎందుకంటే ఊహించని అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, వాహనం చెడిపోవటం, కుటుంబ వైద్య సమస్యలు మొదలైన కొన్ని పరిస్థితులపై మనకు నియంత్రణ ఉండదు. పైవాటికి డబ్బులు లేకపోతే అప్పులు చేస్తువుంటాము. ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యవసర నిధి ( Emergency Fund ) అవసరం. ఇది మన ఆర్థిక భద్రతకు పునాది.

Also Read: ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 78,000 వేల సబ్సిడీతో కూడిన సోలార్ విద్యుత్ పధకం.

అత్యవసర నిధి అంటే ఏమిటి?

మనకు ఊహించని ఖర్చులు సంభవించిన సందర్భంలో అత్యవసర నిధి భద్రతా వలయం వలె ఉపయోగపడుతుంది. ఇది మన రోజువారీ అవసరాలకు మరియు అత్యవసర పరిస్థితులకు రెండింటికీ ఉపయోగపడుతుంది. ఈ డబ్బుతో, మనం రుణం మరియు ఆర్థిక ఒత్తిడి లేకుండా కష్ట సమయాలలో గట్టేక్కగలం.

$ads={1}

అత్యవసర రిజర్వ్ ( Emergency Reserve Required ) అవసరం.

1. ఊహించని ఖర్చులను నిర్వహించడానికి.

జీవితం ఊహించలేనిది అటువంటి పరిస్థితుల్లో అంటే ఉదాహరణలు వైద్య సహాయం అవసరం ( Medical Expenses ) , ఆటో నిర్వహణ ( Auto Maintenance ) లేదా పనిచేయని గృహోపకరణాలు ( Home Appliances ). అత్యవసర నిధి ఉంటే వెంటనే డబ్బు అందుబాటులో ఉంటుంది.

2. ఒకరు ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో సహాయం.

ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కొత్త ఉద్యోగం వెతకటం కోసం చాలా నెలలు పట్టవచ్చు. అటువంటి సందర్భంలో అద్దె, ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు, పిల్లల విద్య అన్నీ ఆ సమయంలో దీని అవసరం ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ఈ తక్షణ ఆర్థిక అవసరాలు అత్యవసర నిధి ద్వారా తీర్చుకోవచ్చు.

3. అప్పుల భారం నుండి దూరంగా ఉండటానికి.

అప్పులున్నసందర్భంలో వారికి డబ్బు అవసరమైనప్పుడు, చాలా మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్తారు లేదా క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపుతారు. అయితే, అవి చాలా వడ్డీ రేటుతో కూడుకున్నవి. అటువంటి సమయంలో అవసర నిల్వ ఉంటే ఈ వడ్డీ ఖర్చును పూర్తిగా నివారించవచ్చు.

4. శాంతి మరియు భద్రత.

చేతిలో తగినంత డబ్బు ఉందనే నమ్మకం మనసుకు ఓదార్పునిస్తుంది. ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్లు అనిపించినప్పుడు మనం మరింత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.

5. కుటుంబాన్ని సురక్షితంగా ఉంచండి.

కుటుంబ సభ్యుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా మరొక అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ నిధి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కష్ట సమయాల్లో కుటుంబానికి మద్దతు పనిచేస్తుంది.

$ads={2}

6. అత్యవసర నిధి కోసం ఎంత డబ్బు అవసరం?

ప్రతి నెలా కనీసం మూడు నుండి ఆరు నెలల పాటు మీ ఖర్చులను భరించడానికి తగినంత డబ్బును చేతిలో ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తారు.
ఉదాహరణకు: మీ నెలవారీ ఖర్చులు రూ.30,000 అయితే, మీరు అత్యవసర పరిస్థితుల కోసం కనీసం రూ.90,000 నుండి రూ.1,80,000 వరకు పొదుపు చేయాలి.

7. దాన్ని ఎక్కడ దాచి పెట్టాలి?

ఈ సంపదను సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంచాలి. ఉదాహరణకు:

  • పొదుపు బ్యాంకు ఖాతా
  • ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)
  • లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్
ఈ ఎంపికలు అవసరమైనప్పుడు డబ్బును సులభంగా అందుబాటులో ఉంచుతాయి.

చివరి మాట.

అత్యవసర నిధి అనేది కేవలం పొదుపు ఖాతా కంటే ఎక్కువ ఇది జీవిత బీమా మాదిరిగానే పనిచేస్తుంది. ఇది కష్ట సమయాల్లో మనకు ఓదార్పునిస్తుంది మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీరు ఒక చిన్న మొత్తంతో ప్రారంభించి, ప్రతి నెలా అత్యవసర నిధి క్రింద డబ్బులు దాచి పెడితే  అది కొన్ని నెలల్లో గణనీయమైన సెక్యూరిటీగా పెరుగుతుంది.

              అత్యవసర నిధి అనేది " కష్టసమయంలో కాపాడే మన స్నేహితుడు "

Also Read: ఎట్టకేలకు APSRTC ఉద్యోగులకు పదోన్నతులు షురూ.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది