Recents in Beach

తెలంగాణాలో డిగ్రీ,పిజి పరిక్షల రద్దు పరిక్షలు లేకండ డిగ్రీ పట్టా ...








  హలోఫ్రెండ్స్,తెలంగాణాలో కరోన వ్యాప్తి అత్యదికంగా ఉండటంతో డిగ్రీ,పిజి పరిక్షల రద్దుకే అవకాశాలున్నాయి.ముఖ్యంగ హైదరాబాద్ వంటి నగరంలో కరోన పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింత పెరగటంతో పరిక్షల రద్దుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇటివల కాలంలో పదవ తరగతి పరిక్షలు రద్దు చేసి,ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికి తెలిసిందే.



      అదేవిధంగా బిఎ,బికం మరియు బియసి డిగ్రీ,పిజి,బి టెక్ పరీక్షలను సైతం రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తునట్లు తెలుస్తుంది.తాజాగా డిగ్రీ,బి టెక్ పరిక్షల నిర్వహణపై విద్య శాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి గారు వున్నత అధికారులతో,ఇన్ఛార్జ్ వి సి ,రిజిస్టర్లు,ప్రొఫెసర్స్ తో సమావేశంలో నిర్వహించారు.

        ఈ సమావేశంలో అందరు పరిక్షలు రద్దు చేసి డిగ్రీ ఫస్ట్,సెకండ్ ఇయర్ విద్యార్దులను తరువాతి తరగతికి ప్రమోట్ చేయాలని సూచించారు.ఇకపోతే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్దులను ఇంటర్నల్ మార్కుల ఆధారంగ పాస్ చేయాలని అధికారులు సూచించినట్లు తెలుస్తుంది.

         ఇక జెయాన్టియుహెచ్,ఓయూ,ఇతర యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే  బీ టెక్ పరిక్షలు రద్దుపై అనే దానిపై నిర్ణయం తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి.యుజిసి మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 1వ తేది  నుండి ఫస్ట్ ఇయర్ అలాగే ఆగష్టు 15వ తేది నుండి డిగ్రీ సెకండ్,థర్డ్ ఇయర్ క్లాసుల నిర్వహణపై చర్చించారు.


           ఈ ప్రతిపాదనలను సి యం కేసిఆర్ గారి దృష్టికి తీసుకువెల్లి ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తరువాతనే అమలులోకి రానున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు