ఆంధ్రప్రదేశ్ రేషన్ బండి ఎందుకు :
ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1,2021 నుండి ఇంటి వద్దకే రేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది, అంటే మనం ఇంతకుముందు రేషన్ కావాలి అంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి " Q " లో నుంచుని రేషన్ తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు వాలంటీర్ లు మన ఇంటి వద్దకే రేషన్ బండి, రేషన్ తీసుకుని వస్తారు. దీని కోసం మన చెయ్యవలసింది మన మొబైల్ నెంబర్ మన ఆధార్ కార్డు లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి లేఖపొతే లింక్ చేసుకోండి. ఎందుకంటె మన మొబైల్ కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ని వాలంటీర్ వల్ల ఇవ్వబడిన డివైస్ లో ఎంటర్ చేసుకుని మనకు రేషన్ ఇవ్వటం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రేషన్ బండి పొందాలి అంటే :
మనకు రేషన్ ఇవ్వటానికి రేషన్ బండి కావాలి కదా. ఈ రేషన్ బండి కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల నుండి ధరకాస్తులు కోరటం జరుగుతుంది. ఇది రిజర్వేషన్ వారిగ రేషన్ బండి కోసం ధరకాస్తు కోరటం జరిగింది. దీనికి సంభందించి ఎస్ సి కార్పోరేషన్నుండి నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ కావాలి అంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For SC Notification లేదా
నోటిఫికేషన్ యొక్క వివరాలు :
ఆంధ్రప్రదేశ్ ఎస్ సి ప్రభుత్వ మైనారిటీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వార కృష్ణ జిల్లా మైనారిటీ ( ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పారాశికులు, మరియు జైనులు ) ప్రభుత్వం ఇచ్చు సుబ్సిడి లోను, క్రింద 60% రాయితీతో ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణి చేసేందుకు 4 చక్రాల వాహనం ప్రభుత్వం వారు అందించటం జరిగింది.
విద్యార్హత :
- 7వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- వయసు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
మీ దగ్గరలో ఉన్న గ్రామా / వార్డ్ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీ కి ధరకాస్తులు చేసుకోవలసి ఉంటుంది.
రేషన్ బండి కోసం అర్హత :
ఈ క్రింది వారు రేషన్ బండికి అర్హులు.
- ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అందులో ఇన్కమ్ మండలలో 10,000, పట్టణాలలో 12,000 మించి ఉండకూడదు.
- రెసిడెన్స్ ప్రూఫ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పకుండ ఉండాలి.
- 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆధార్ కార్డు తప్పనిసరి.
- 7వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ తప్పనిసరిగ ఉండాలి.
- లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ( యల్ యం వి ) తప్పనిసరిగ ఉండాలి.
- లోకల్ అభ్యర్ది అయ్యి ఉండాలి.
- క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగ ఉండాలి, ఓసి, ముస్లిం మైనారిటీలకు కాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు.
- క్రొత్త పాస్ పోర్ట్ ఫోటోలు ఉండాలి.
ఈ క్రింది తెలిపిన వారు అనర్హులు.
- గవర్నమెంట్ సర్వీస్ / గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు.
- కుటుంబ సభ్యులలో ఎవరికైన 4 వీల్ వాహనం ఉండకూడదు.
- ఇన్కమ్ టాక్స్ కట్టేవారు అనర్హులు.
- గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ రాయితీతో ఎటువంటి వాహనం పొంది ఉండకూడదు.
పైన తెలిపిన వారు రేషన్ వాహనం పొందటానికి అనర్హులు.
మీకు ఇంక దీనికి సంభందించి మరిన్ని వివరములు కావాలి అంటే మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్, యన్టిఆర్ సర్కిల్, పడమట, విజయవాడ ఆఫీసు నందు సంప్రదించగలరు.
ఫోన్ నంబర్ : 0866 - 2491148
Conclusion :
ఆంధ్రప్రదేశ్ లోరేషన్ బండి కోసం ఎస్సి వాళ్ళ కోసం ఎక్కడ, ఎల, అప్లై చెయ్యాలి. దీనికి సంభందించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!