- ఏపిలో 50ఏళ్ళకే పెన్షన్.
- బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సహా రాష్ట్రంలోని మైనారిటీలకు.
ఈ రోజు ఏపీ శాసనమండలి మరో ముఖ్యమైన అంశం వైసిపి వాళ్ళు లేవనెత్తారు. 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని సంకీర్ణ ప్రభుత్వం ఇచ్చిన హామీని అలాగే పెన్షనర్ల వయస్సు తగ్గింపును వైసిపి సభ్యులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఎసి,ఎస్టి,బిసి మైనార్టీ వాళ్ళకు 50ఏళ్ళకే చెల్లించాలన్న హామీ నెరవేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అనర్హులైన పింఛనుదారులను తొలగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: Vizag Incident: అమ్మాయిని వీడియో తీసిన యువకుడు, అమ్మాయి తల్లితండ్రులు జైలు పాలు.
సామాజిక భద్రతా పెన్షన్ ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన పెద్దలకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, 50 ఏళ్లు పైబడిన మైనారిటీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేద ప్రజలందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందేలా చూడటానికి, క్యాబినెట్ ఉపకమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అనర్హులైన వ్యక్తులు పెన్షన్లు పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా గణాంకాలను పొందింది. పెన్షన్లకు అనర్హులైన వారిని గుర్తించి తొలగిస్తున్నారు.
రాష్ట్రంలో 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 15 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు. అయితే, వారికి పెన్షన్ ఎలా ఇవ్వాలో నిర్ణయించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు మంత్రులకు అధికారులకు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సహా రాష్ట్రంలోని మైనారిటీలకు త్వరలో 50 సంవత్సరాలకు పెన్షన్ లభిస్తుందని మంత్రి ప్రకటించారు. 4, 000 పెన్షన్ లభించడం పట్ల చాలా మంది సంతోషిస్తున్నారు.
Also Read: Lenovo Solar Laptop: ప్రపంచంలో తోలి సోలార్ లాప్ టాప్.
సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, కాని వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పుడు 53 లక్షల మంది ఉన్నారని రమేష్ యాదవ్ తెలిపారు. యాభై సంవత్సరాల పాటు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, పది నెలలు గడిచినా ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఎంఎల్సి తోట త్రిమూర్తులు నొక్కి చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!