వైఎస్ఆర్ వాహన మిత్ర :
వైఎస్ఆర్ వాహన మిత్ర అనే పధకాన్ని మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో ప్రారంభించటం జరిగింది. ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎవరైతే ఎస్సి / ఎస్ టి /బి సి/ మైనారిటీ వర్గానికి చెందివుండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో. వారు 4 వీలర్ వాహనం కలిగి వుండి. దానిని కుంటుంబ పోషణ కోసం నడుపుతున్నారో వారు ఈ పధకానికి అర్హులు అని ప్రభుత్వం చెప్పటం జరిగింది. వీరికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10000 రూపాయలను అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ డబ్బులను వారు వాహనం ఇన్సూరెన్స్ , రోడ్ టాక్స్ లేదా వాహనం బాగుచేసుకోవటానికి వాడుకోవచ్చు.
పోయిన సంవత్సరం వాహన మిత్ర వచ్చి ఈ సంవత్సరం రాకపోతే :
పోయిన సంవత్సరం వాహన మిత్ర వచ్చి ఈ సంవత్సరం రాకపోతే మీరు మీ గ్రామా సచివాలయంలో అర్హుల లిస్టు ఉంటుంది. అందులో మీ పేరు లేఖపోతే మీరు కారణం తెలుసుకుని మళ్ళి వాహన మిత్ర కు అప్లై చేసుకోవాలి.
క్రొత్తగా వాహన మిత్ర అప్లై చేసుకోవాలి అంటే :
ఈ సంవత్సరం ఎవరైనా క్రొత్తగా వాహనం కొంటె వారు ఈ వాహన మిత్ర అనే పదకానికి అర్హులు అయితే మీరు మీ గ్రామా / వార్డ్ వాలంటీర్ ని సంప్రదించి క్రొత్తగ ఈ పధకానికి అప్లై చేసుకోండి.
ఏయే డాక్యుమెంట్స్ కావాలి :
ఎవరైతే వాహన మిత్ర కు అప్లై చేయ్యదలచు కున్నారో వారు ఈ క్రింది వాటి నకలును వాలంటీర్ కి ఇవ్వవలసి ఉంటుంది.
1) ఆధార్ కార్డు.
2) రేషన్ కార్డు.
3) ఎస్సి / ఎస్ టి /బి సి/ మైనారిటీ వర్గానికి చెందినట్లయితే వారి యొక్క క్యాస్టు సర్టిఫికేట్.
4) 4 వీలర్ యొక్క రిజిస్త్రేషన్ సర్టిఫికేషన్ (RC ) అది అర్హత కలిగిన అభ్య్యర్ది పేరున ఉండాలి.
5) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
6) బ్యాంకు ఖాతా బుక్ ముందు పేజి నకలు ఇవ్వాలి.
పైన చూపిన డాక్యుమెంట్స్ మరియు వాహన మిత్ర అప్లికేషన్ ఫామ్స్ తో కలిపి ఇవ్వాలి. ఈ వాహన మిత్ర కు చివరి తేది జులై 7వ తారీకు.
డబ్బులు ఎప్పుడు ఇస్తారు :
వాహన మిత్ర కు సంభందించి 10000 రూపాయలు జూలై నెల 15వ తేదిన అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరిగింది.
ఈ క్రిందివి కుడా చదవండి :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగింపు.
తెలంగాణాలో ఉన్న వారు EPass కోసం ఎల Apply చేయాలి.
ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.
ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!