తెలంగాణాలో 80,039 వేల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పటం జరిగింది.
ఈ రోజు నుంచే భర్తీ ప్రక్రియ మొదలు పెడతాం అని చెప్పటం జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం శాఖలలో కాంట్రాక్టు పని చేస్తున్న వారందరిని రేగులరైజ్ చేస్తాం అని ప్రకటించారు. సుమారు 11, 103 కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తాం అని చెప్పారు.
అంతేకాదు ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ విడుదల చెయ్యటం జరుగుతుంది. యునిఫారం పోస్టులకు 10 సంవత్సరాల వయోపరిమితి పెంపు.
పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
గ్రూప్ 1 - 503 పోస్టులు
గ్రూప్ 2 - 582 పోస్టులు
పొలిసు శాఖలో 18,334 పోస్టులు
సెకండరీ విద్య శాఖలో 13,086 పోస్టులు
వైద్యశాఖలో 12,755 పోస్టులు
ఉన్నత విద్యశాఖలో 7,878 పోస్టులు
బీసి సంక్షేమం శాఖలో 4,311 పోస్టులు
రెవిన్యూ శాఖలో 3,560 పోస్టులు
ఎస్సి డెవలప్మెంట్ 2,879 పోస్టులు
ఇరిగేషన్ 2,692 పోస్టులు
లేబర్ వెల్ఫేర్ 2,399 పోస్టులు
మైనర్టీస్ లో 1,825 పోస్టులు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 1,455 పోస్టులు
కార్మిక శాఖలో 1,221 పోస్టులు
ఫైనాన్సు శాఖలో 1,146 పోస్టులు
శిశు సంక్షేమ శాఖలో 895 పోస్టులు
మున్సిపల్ శాఖలో 854 పోస్టులు
వ్యవసాయ శాఖలో 801 పోస్టులు
రవాణ శాఖలో 563 పోస్టులు
న్యాయ శాఖలో 386 పోస్టులు
పశుసంవర్ధక శాఖలో 353 పోస్టులు
పరిపాలన శాఖలో 343 పోస్టులు
ఇండస్ట్రీ 233 పోస్టులు
టూరిజం శాఖలో 184 పోస్టులు
సివిల్ సప్లై లో 106 పోస్టులు
అసెంబ్లీ లో 25 పోస్టులు
పై పోస్టులకు సంభందించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ క్రిందివి కూడా చదవండి :
"అంకుల్ " అన్నదుకు అమ్మాయిని చితకబాదిన...వ్యక్తి
అమ్మవొడి ఈ సంవత్సరం జనవరిలో రాదు, జూలై 2022 నెలలో వస్తుంది.
అమ్మ ఒడి కి సంభందించి ఈ సంవత్సరం రూల్స్ మారాయి.
రేపు అసెంబ్లీ సాక్షిగా కేసిఆర్ గారు ఏమి చెప్పబోతున్నారు ?
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!