హలో ఫ్రెండ్, కరోన కారణంగ కేంద్ర లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కాలంలో ఎవ్వరు ఇంట్లో నుండి బయటికి రాకూడదు అని కేంద్రం చెప్పటం జరిగింది. పేద ప్రజలు జీవనోపాధి ఎల అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని రావటం జరిగింది. అది ఏమిటంటే " ఉచిత రేషన్ " అనే పధకాన్ని తీసుకుని రావటం జరిగింది.
Also Read : పియం కిసాన్ సమాన్ నిధి అంటే ఏమిటి ? ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.
ఈ ఉచిత రేషన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే భారత దేశంలో రేషన్ కార్డు కలిగి ఉంటారో. వారందరూ ఈ ఉచిత రేషన్ తీసుకోవటానికి అర్హులు, అలాగే మొదట కొంత మంది వలస కార్మికులకు ఈ ఉచిత రేషన్ ఇచ్చారు. అయితే ఇది మొదట 3 నెలలు అనుకున్నారు. అలాగే లాక్ డౌన్ మరో 3 నెలలు పెంచటంతో ఈ ఉచిత రేషన్ పధకాన్ని కుడా మరో 3 నెలలు పెంచటం జరిగింది. ఇప్పటి వరకు అంటే మార్చి నుండి ఇప్పటి వరకు 14 విడతలు ఉచిత రేషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ నవంబర్ కుడా రెండు విడతలు ఇవ్వటం జరిగింది. అయితే మన కేంద్ర ప్రభుత్వం మొదట నవంబర్ వరకు మాత్రమే ఉచిత రేషన్ అని చెప్పటం జరిగింది. అయితే ప్రజలు ఈ కరోన మిగిల్చిన ఆర్ధిక సంక్షోబం నుండి కోలుకోకపోవటంతో వచ్చే సంవత్సరం మార్చి వరకు ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. కాని దీనిపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయ్యాలేదు.
రేషన్ కార్డుల జారి :
ఈ కరోన ప్రభావంతో ఇస్తున్న ఉచిత రేషన్ అనేది రేషన్ కార్డు ఉన్న వారికే కాబట్టి, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిచాటంతో చాల మంది అప్లై చేసుకోవటం జరిగింది. అలగే కొంతమంది రేషన్ కార్డులు అనేక కారణాల చేత రిజెక్ట్ చెయ్యటం జరిగింది. అవి ఏమిటంటే
- ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని రిజెక్ట్ చేసారు.
- కరెంటు బిల్ లో యూనిట్స్ ఎక్కువ వచ్చాయని రిజెక్ట్ చేసారు.
- ఇన్కమ్ టాక్స్ పే చేసారు అని రిజెక్ట్ చేసారు.
- భూమి ఎక్కువగా ఉంది అని రిజెక్ట్ చేసారు.
- ఫోర్ వీలర్ ఉంది అని రిజెక్ట్ చేసారు.
ఇల అనేక కారణాల వాళ్ళ రేషన్ కార్డు రిజక్ట్ చెయ్యటం జరిగింది. అయితే వీరికి ప్రభుత్వం ఏమని చెప్పింది అంటే సంభందిత అధికారి చేత ఒక లెటర్ అడగటం జరిగింది.
- కరెంటు బిల్ లో యూనిట్స్ ఎక్కువ వచ్చాయని రిజెక్ట్ చేస్తే మీ ప్రాతంలో ఉన్న ఏఐ చేత లెటర్ ఇస్తే సరిపోతుంది.
- ఇన్కమ్ టాక్స్ పే చేసారు అని రిజెక్ట్ చేస్తే ఇన్కమ్ టాక్స్ అధికారి చేత లెటర్ ఇస్తే సరిపోతుంది.
- భూమి ఎక్కువగా ఉంది అని రిజెక్ట్ MRO ద్వార లెటర్ ఇస్తే సరిపోతుంది.
- ఫోర్ వీలర్ ఉంది అని రిజెక్ట్ RTO ఆఫీస్ ద్వార లెటర్ ఇస్తే సరిపోతుంది.
Also Read : మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.
ఆరోగ్య శ్రీ కార్డు :
ఇంతకుముందు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చే వాళ్ళ, ఇప్పుడు అల కాదు రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్య శ్రీ కార్డు ఇవ్వటం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోండి ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ Rs. 5,00,000 వరకు పొందవచ్చు.
అలాగే హాస్పిటల్ బిల్ Rs. 1,000/- దాటితే అది ఆరోగ్య శ్రీ క్రిందకి వస్తుంది అని మన ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది.
వైఎస్ఆర్ భీమా :
ఈ వైఎస్ఆర్ భీమా కోసం మనం కొత్తగా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు, రేషన్ కార్డు ఉంటే చాలు వైఎస్ఆర్ భీమా పధకం వర్తిస్తుంది. రేషన్ కార్డు లో ఫ్యామిలీ హెడ్ ఎవరితే వున్నారో వారు ఈ వైఎస్ఆర్ భీమా కి అర్హులు అవుతారు. అంటే ఫ్యామిలీ లో ఒక్కరు మాత్రమే అర్హులు. ఒకవేళ ఫ్యామిలీ హెడ్ ప్రమాదవశాత్తు మరణిస్తే, యాక్షిడెంటు డెత్ జరిగితే ఈ వైఎస్ఆర్ భీమా డబ్బులు నామిని బ్యాంకు ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది. దీని కోసం ఇప్పటికే నామిని పేరా ప్రభుత్వమే బ్యాంకు ఖాతా ఓపెన్ ( జన్ ధన్ ఖాతాలు ) చేపించటం జరిగింది.
ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందండి.
Conclusion :
పైన మీరు ఉచిత రేషన్ వివరాలు, అలాగే రేషన్ కార్డు వాళ్ళ ప్రయోజనాలు తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కుడా చదవండి :
చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?
మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చెయ్యాలి అంటే ఏ యే డాక్యుమెంట్స్ కావాలి.
వైఎస్ఆర్ చేయూత పధకం రద్దు ప్రభుత్వం G.O జారి చేసింది కారణం ఏమిటి ?
మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!