Recents in Beach

" జగనన్న తోడు " పధకం ను ప్రారంభించనున్న ఏపి సియం జగన్ మోహన్ రెడ్డి.

 



ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే " జగనన్న తోడు " అనే పధకానికి అప్లై చేసుకున్నారో వారందరి బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు పడనున్నాయి. ఈ రోజు అధికారికంగ ప్రారంభించి వారికీ ఇవ్వవలసిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చెయ్యనున్నారు.

Also Read : డిసెంబర్ 1 నుండి పెరగనున్న రేషన్ సరుకుల ధరలు.

జగనన్న తోడు పధకం ముఖ్య ఉద్దేశం :

ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు వున్నారో. చిన్న చిన్న వ్యాపారులు అంటే షాప్ అనేది 5 అడుగుల పొడవు మరియు 5 అడుగుల వెడల్పు ఉన్న షాప్ ను చిన్న షాప్ గ ఈ పధకంలో తీసుకోవటం జరిగింది. ఈ 5 అడుగుల పొడవు మరియు 5 అడుగుల వెడల్పు ఉన్న స్థలం లేదా అంతకంటే తక్కువ ఉన్న స్థలంలో శాశ్విత లేదా తాత్కాలికంగ ఈ యొక్క పధకానికి అర్హులుగ ప్రకటించటం జరిగింది.

అలాగే విధి వ్యాపారాలు అంటే తోపుడు బండ్లు ఉంటాయి కదా ఈ తోపుడు బండ్లు ఉన్న వారిని కూడ ఈ పధకంలోనికి తీసుకోవటం జరిగింది. మనం చూస్తూనే ఉంటాం తోపుడు బండ్లపై కూరగాయలు వ్యాపారం చేస్తూ ఉండేవారు, తోపుడు బండ్లపై పళ్ళు అమ్ముకునే వారు ఉంటారు వీరు దీని క్రిందకి వస్తారు.

ఇప్పటికే ఎవారైతే అప్లై చేసుకున్నారో వారందరికి ఈ రోజు వారి వారి బ్యాంకు ఖాతాలో రూ 10,000/- వడ్డి లేని ఋణం  వెయ్యనున్నారు సియం జగన్ మోహన్ రెడ్డి. అంటే ఈ రోజు ఎవరైతే అప్లై చేసున్నారో వారి బ్యాంకు ఖాతాలోకి రూ 10,000/- జమ అవుతాయి.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో అనర్హుల వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి ?

జగనన్న తోడు పధకానికి అర్హులు :

  1. ఫుట్ పాత్ లపై లేదా రోడ్ల ప్రక్కన ఖాళి స్థలాలలో ఎవరైతే తోపుడు బండ్ల పై వ్యాపారం చేస్తారో వారందరూ అర్హులే.
  2. చేనేత కళాకారులు నెత్తిపై గంపలు పెట్టుకుని అమ్ముకునే వారు అర్హులు.
  3. సైకిల్ పై, మోటర్ వాహనాలపై గంపలు పెట్టుకుని అమ్ముకునే వారు అర్హులు.
  4. ఆటోలో వస్తువులు తీసుకొని వెళ్లి వ్యాపారాలు చేసుకునే వారు అర్హులు.
  5. సంప్రదాయ వృత్తులు, బొమ్మల కళాకారులు, యంత్ర సామాగ్రి తయారు చేసుకునే వారు అర్హులు.
మొత్తంగ చెప్పాలి అంటే మొత్తం విధి వ్యాపారులు ఈ పధకానికి అర్హులు అని చెప్పవచ్చు.

ఎంపిక ఎల చేస్తారు :

వాలంటీర్లు ద్వార ఒక సర్వే నిర్వహించటం జరిగింది. ఈ సర్వేలో విధి వ్యాపారులను గుర్తించి, వారి దగ్గర నుండి అప్లికేషను పూర్తి చేపించి. ఈ పధకానికి అర్హులైన వారి అప్లికేషను లను గ్రామా / వార్డ్ సంచివాలయంలో ఇవ్వటం జరిగింది. తద్వార గ్రామీణ ప్రాంతాలలో యంపిడిఓ, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమీషనర్ల ద్వార సంభందిత బ్యాంకు లకు పంపటం జరుగుతుంది.
ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికి ఈ సియం జగన్ మోహన్ గారి చేతుల మీదగా వారి వారి బ్యాంకు ఖాతాలో 10,000/- వడ్డి లేని ఋణం జమ చెయ్యనున్నారు.

ఈ క్రిందివి కుడా చదవండి :








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు