Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో అనర్హుల వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి ?

 



ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే అనర్హులను ఏరివేయ్యటం జరుగుతుంది. ఇది గ్రామా / వార్డ్ వాలంటీర్ ద్వార సర్వే చేయించి అనర్హులను నిలిపివేయ్యనున్నారు. 

Also Read : ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ పునఃప్రారంభంలో స్వల్ప మార్పు.

వృద్ధాప్య పెన్షన్ :

ఆంధ్రప్రదేశ్ లో 65 సంవత్సరాలు నిండిన వృద్దులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వృద్దాప్య పెన్షన్ ఇవ్వటంలో ఎటువంటి జాప్యం జరగదు. అయితే ఇప్పటి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటంలో మరింత స్పీడ్ గ  ఉందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుండి ఏ ప్రభుత్వ పధకం అయిన ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రజలకు మరింత స్పీడ్ గ అందుతుంది. అలాగే వృద్దాప్య పెన్షన్ కుడా అంతే ఉదయం 8 గంటలకు రాష్ట్రం మొత్తంలో 95% పెన్షన్ పంపిణి జరుగుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వార మాత్రమే సాధ్యమైనది అని చెప్పవచ్చు.

వృద్దాప్య పెన్షన్ దారుల ఏరివేత కారణం ఏమిటి :

కొంతమంది మాత్రం వృద్దాప్య పెన్షన్ త్వరగా పొందాలి అనే ఉద్దేశ్యంతో ఆధర్ కార్డు లో ఉన్న పుట్టిన తేదిని మార్చి వృద్దాప్య పెన్షన్ పొందటం జరుగుతుంది. ఇటువంటి వారిని వారి యొక్క ఆధర్ కార్డు హిస్టరీ ద్వార చెక్ వారికీ పేరు వృద్దాప్య పెన్షన్ జాబితా నుండి తొలగించటం జరిగింది. వీరికి డిసెంబర్ నుండి పెన్షన్ రాదు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బండి కోసం ఎస్సి వాళ్ళ కోసం ఎక్కడ,  ఎల,  అప్లై చెయ్యాలి. దీనికి సంభందించిన నోటిఫికేషన్.

మరికొంత వివిధ కారణాల వల్ల అనర్హులుగ తేల్చటం జరిగింది అయితే వీరి యొక్క జాబితా ఇప్పటికే ఆయా గ్రామా / వార్డ్ సచివాలయాలకు పంపటం జరిగింది. ఈ అనర్హుల జాబితాలోని వారిని పేర్ల ద్వార వాలంటీర్ లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులు అయితే అర్హులుగ లేదా అనర్హులు అయితే అనర్హులుగ ప్రకటించి ఈ డిసెంబర్ నుండి పెన్షన్ నిలిపి వెయ్యటం జరుగుతుంది.

వృద్దాప్య పెన్షన్ ఎప్పుడు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన్నప్పుడు ఈ పెన్షన్ అనేది ఇంతకుముందు ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ రూ. 2000/- రూపాయలను రూ. 3000/- వరకు పెంచుకుంటూపోతాం అని చెప్పటం జరిగింది. అది కూడ ప్రతి సంవత్సరం రూ 250/- చొప్పున అని చెప్పటం జరిగింది. అందులో భాగంగానే అధికారoలోకి వచ్చిన వెంటనే రూ 250 పెంచటం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పడు సంవత్సరం అవుతుంది మళ్ళి ఎప్పుడు పెంచుతారు అని లభిదారులు ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళస్తలాలు ఇవ్వటానికి తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం.

కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

గ్యాస్ బుకింగ్  సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవాలి.

2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు