Recents in Beach

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.

 



ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి ప్రారంభం దీనిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన చేతుల మీదగ ప్రారంభించనున్నారు. అలగే వేలలో ఇళ్ళకు పునాదులు కూడ వేయనున్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.

ఇళ్ళ పట్టాలు :

ఆధ్రప్రదేశ్ లో ఎవరైతే నిరుపేదలు ఉండటానికి ఇల్లు కూడ లేనివారు ఉన్నారో వారందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణం కూడ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని అక్క చేల్లెమ్మలకు 17,0005  జగనన్న కాలనీలు లకు ఏర్పాటు చేసి ఇంటి  నిర్మాణం ప్రారంభించనున్నారు. అలాగే ఆ కాలనీలలో 6,800 కోట్ల వ్యయంతో త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీలు, విధ్యుత్ వంటి సదుపాయాలు కలిపించానున్నారు.

ఇంటి స్థలం సైజు కూడ పెంచటం జరిగింది ఇంతకూ ముందు 224 చ.అ. అనుకున్నారు తరువాత దానిని 340 చ.అ పెంచటం జరిగింది. రాష్ట్రంలో పేదలందరికీ శాశ్విత గృహం ఇవ్వాలనే ఉద్దేశంతో 50,940 కోట్ల వ్యయంతో 28.30 లక్షల ఇళ్ళ పంపిణి కి ఈ రోజు శ్రీకారం చుట్టారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల 15.6 ఇళ్ళ పంపిణి మాత్రమే జరగనుంది ఇది మొదటి దశ, రెండవ దశలో మీగత ఇళ్ళ స్థలాల పంపిణి జరుగుతుంది.

టిడ్కో ఇళ్ళు :

రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఉండే ఇళ్ళు లేని అక్క, చేల్లెమ్మలకు 21,345 కోట్ల వ్యయంతో 2.62 లక్షల టిడ్కో ఇళ్ళకు సంభందించి సేల్ అగ్గ్రిమేంట్ కుడ ఈ రోజు ఇవ్వనున్నారు. అయితే ఇప్పుడు 1.43 లక్షల లబ్దిదారులకు 300 చ.అ. ఇళ్ళను కేవలం 1 రూపాయికే అందించనున్నారు.

Also Read : జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!

345 చ.అ, 430 చ.అ గల టిడ్కో ఇళ్ళకు ఒకవైపు ప్రభుత్వ వాటా ప్రభుత్వమే చెల్లిస్తూ, మరో వైపు లబ్దిదారులు చెల్లించవలసిన వాటాలో 50 శాతం వాటా కూడ ప్రభుత్వం చెల్లించటం గమనార్హం. దీనికి అదనంగ ప్రభుత్వానికి 482 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వానికి 2.62 లక్షల టిడ్కో ఇళ్ళకు లబ్దిదారుల తరపు 4,287 కోట్ల వ్యయం అదనపు భారం జగనన్న ప్రభుత్వమే భరిస్తుంది. 

అర్హులైన నిరుపేదలు అక్క, చెల్లెమ్మలందరికి అవినీతికి తావు లేకుండ, ఎటువంటి వివక్షత లేకుండ గ్రామా / సచివాలయం ద్వార ఇంటింటి సర్వ్ చేసి అర్హులైన వారికి ఇళ్ళు మంజూరు చెయ్యటం జరుగుతుంది.

గమనిక : 

ఇప్పటికి అర్హులైన వారు ఎవరైనా ఉంది వారి పేరు ఈ ఇళ్ళ పట్టాల లిస్టు లో పేరు లేఖపోతే సచివాలయం ద్వార అప్లై చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ళు మంజూరు చెయ్యటం జరుగుతుంది.

ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చెయ్యండి : 1902

 Conclusion :

దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!

అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?

అమ్మ ఒడి  రాకపోవటానికి గల కారణాలు.


 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు