తెలంగాణా రాష్ట్రంలో ఎస్సి కార్పొరేషన్ కి సంభందించి ఎవరైతే లోన్ కోసం అప్లై చెయ్యదలచు కున్నారో ఈ ఇప్పుడు అప్లై చేసుకోండి.
Click Here For Link or https://tsobmms.cgg.gov.in/
Also Read : వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?
తెలంగాణా ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను ఎస్సి కార్పొరేషన్ లోన్స్ ఇవ్వటానికి సిద్ధపడుతుంది. దీనికోసం ఆన్లైన్ లో అప్లికేషను తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తుంది. మనం తీసుకున్న లోన్ లో సబ్సిడీ 80 % శాతం ఉంటుంది. 20% శాతం మాత్రమే మనం చెల్లించవలసి ఉంటుంది. ఈ సబ్సిడీ మనం పే చెయ్యవలసిన అవసరం లేదు.
ఉదాహరణకు : 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే మనం కేవలం 20,000 రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించాలి అన్న మాట.
ప్రస్తుతం ఎస్సి వారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. తరువాత ఎస్టి, బిసి వారికి కూడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ రెండు సెక్టార్ లలో లోన్ మంజూరు చెయ్యటం జరుగుతుంది.
- హార్టీ కల్చర్ సెక్టార్
- ట్రాన్స్పోర్ట్ సెక్టార్
4 వీలర్ వాహనాలైన బాడుగాకి వాడుకొనే టాక్సీ, క్యాబ్, ప్యాసింజర్ వాహనాలు అన్ని 4 చక్రాల వాహనాలు ఈ సెక్టార్ క్రిందకి వస్తాయి.
హార్టీ కల్చర్ సెక్టార్ :
4 చక్రాల వాహనాలు కాకుండ మిగతావి ఈ సెక్టార్ క్రిందకి వస్తాయి. అంటే గేదల లోన్, ఫ్లోర్ మిల్
, ఆవుల లోన్, మేకల లోన్ వంటివి ఈ సెక్టార్ క్రిందకి వస్తాయి.
ఏ యే డాకుమెంట్స్ కావాలి :
- ఆధార్ కార్డు
- కుల దృవీకరణ పత్రం
- ఆదాయ ద్రువీకరణ పత్రం
- పాన్ కార్డు అవసరం అయితే
- పాస్ సైజు ఫోటో
- బ్యాంకు ఖాతా వివరాలు
పై చూపిన డాకుమెంట్స్ ఉంటే మనం ఈ ఎస్ సి కార్పొరేషన్ లోన్స్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎల అప్లై చేసుకోవాలి :
ఇప్పుడు మనం ఈ ఎస్సి కార్పొరేషన్ లోన్స్ కి ఆన్లైన్ లో ఎల అప్లై చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here For Link or https://tsobmms.cgg.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన చుడండి " Apply Online for SC Corporation Registration " అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
ఇక్కడ నోట్ చదవండి ఈ నోట్ ఏమిటంటే
" ఈ రిజిస్ట్రేషన్ ధరకాస్తూ ఫారం లో బ్యాంకు యొక్క బ్రాంచ్ చూపించక పొతే ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ ను మీరు సెలెక్ట్ చేసుకుంటే మండలం / మున్సిపాలిటీ మ్యాప్ చెయ్యటానికి మీ స్థానిక జిల్లా ఎస్ సి ఐడి కార్యాలయాన్ని సంప్రదించమని మేము కోరుతున్నాము. "
పైన ఉన్న " SC Corporation Registration Click Here " అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో మన రేషన్ కార్డు, ఆధార్, లోన్ వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎల అన్ని వివరాలు ఇచ్చిన తరువాత " GO " అనే బటన్ పై క్లిక్ చెయ్యండి.
తరువాత స్క్రీన్ లో కుడా మీకు మరియు మీరు పెట్టుకోబోయే లోన్ యొక్క వివరాలు ఉంటాయి.
అవి అన్ని చాల జాగ్రత్తగ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి. తరువాత మీకు అప్లికషను వెరిఫై చేసి మిమల్ని బ్యాంకు వారు ఇంటర్వ్యూ జరిపి మీకు లోన్ ఇవ్వటం జరుగుతుంది.
Conclusion :
పైన మీరు తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లోన్ ఎల అప్లై చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!