Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

 




ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన  ఇల్లపట్టాలను వెనుకకు తీసుకోవటం జరుగుతుంది. కారణం ఏమిటి ? ఎవరి ఇల్లపట్టాలు వెనుకకు తీసుకుంటారు ? ఎందుకు తీసుకుంటారు ? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే చివరి వరకు చదవండి.

                                                Link  Click Here

Also Read : తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే


ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తునప్పుడు ప్రామిస్ చేసిన ప్రకారం అర్హులైన వారందరికి ఇళ్ళ పట్టాలను ఇవ్వటం జరిగింది. ఈ ఇల్లపట్టాలు ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 25, 2020 నుండి జనవరి 7, 2021 వరకు ఇళ్ళపట్టాలను పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇలా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయ ప్రాంత ఎంయల్ఎ లు పాల్గొనటం జరిగింది. మొత్తం 30,75 లక్షల ఇళ్ళపట్టాలను అర్హులైన నిరుపేదలను పంపిణి చెయ్యటం జరిగింది. దీనికి గాను ప్రభుత్వానికి అయిన ఖర్చు 23,535 వేల కోట్ల రూపాయలు.

అయితే వచ్చే మూడేళ్ళలో ఈ 30.75 లక్షల ఇల్లుపట్టాలు ఇచ్చిన వారికి 28.3 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనికి సంభందించి డిసెంబర్ 25 తేదిన ఈ ఇళ్ళ నిర్మాణానికి సంభందించి శంకుస్థాపన కూడ చెయ్యటం జరిగింది. ఇది ఇళ్ళపట్టాలకు సంభందించినది.

ఇల్లపట్టాలు ఎందుకు వెనక్కు తీసుకుంటారు :

గతంలో కాని, లేదా గత ప్రభుత్వం హయంలో గాని ఎవరైనా ఇళ్ళ పట్టాలు తీసుకుని ఉన్న, ఇళ్ళ పట్టాలు మాత్రమే కాదు తీసుకున్న ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలంపై ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ లోన్ తీసుకున్న వారికి ఇచ్చిన ఇళ్ళపట్టాను వెనుకకు తీసుకోవటం జరుగుతుంది. దీనికి సంభందించి ఇప్పటికే సేర్వే అనే మొదలు పెట్టారు అధికారులు.

2016 - 17 మరియు 2018 - 19 మధ్య ఎన్టిఅర్ గృహపధకంలో లబ్దిపొందిన వారు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకంలో లబ్దిపొందిన లబ్దిదారులు ఎవరైనా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు తీసుకుని ఉంటే వారి పట్టాలను వెనుకకు తీసుకుంటున్నారు. డిఈఈలు, ఏఈ లు జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు సర్వే చేపట్టి తరువాత వెనక్కు తీసుకోవటం జరుగుతుంది.

ప్రస్తుతం విజయనగరం జిల్లలో ఈ సర్వే చేపడుతున్నారు తరువాత మిగిలిన జిల్లలో సెర్వె నిర్వహిస్తారు. విజయనగరం జిల్లలో మొత్తం 98,286 ఇళ్ళ పట్టాలు పంపిణి చెయ్యటం జరిగింది. 82, 610 స్థలాలలో ఇళ్ళ నిర్మాణానికి అనుమతులు లభించాయి. లే అవుట్లలో 51, 710 ఇళ్ళస్థలాలు ఇవ్వటం జరిగింది. తమ సొంతస్థలాలో ఇల్లుకటుకునే వారు 30,900 మంది, ఇప్పటికే 56,000 వేల మంది నిర్మాణాలు ప్రారంభించటం జరిగిపోయింది.

పట్టాలు మంజూరు చేసిన లబ్దిదారుల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జియోటాగింగ్, చేసి వివరాలు ఆన్లైన్ లో నమోదుచేస్తారు. తరువాత లబ్దిదారుల ఆధార్ నంబర్ ఆధారంగా ఇంతకుముందు గతంలో ఏ పధకం క్రింద లబ్దిపొందారో తెలుసుకుంటారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో eAPCET, ICET, ECET, PGECET, Ed.CET, LAW CET ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసా ?

గతంలో ఇళ్ళుపట్టలు తీసుకున్నారా లేదా తెసుసుకోండి :

ఒకవేళ మీరు గతంలో ఇళ్ళ పట్టాలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి అంటే దీనికోసం ఈక్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

                                                       Click Here For Link 


పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పైన చూపిస్తున్న స్క్రీన్ లో Benificiary ID, Aadhar Card Numbar లేదా Ration Card Numbar ఎంటర్ చేసి గతంలో ఏ ప్రభుత్వం దగ్గర నుండి అయిన ఇళ్ళ పట్టాలు తీసుకున్నమా లేదా తెలుసుకోవచ్చు.  మీరు Aadhar Number ఎంటర్ చేసి Search అనే దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు గతంలో ఇళ్ళపట్టా పొంది ఉండకపొతే మీకు స్క్రీన్ ఈ క్రింది ఉంటుంది.


పై స్క్రీన్ లో లాగ " NO DATA FOUND " అని వస్తుంది. ఒకవేళ మీరు గతంలో ఇళ్ళపట్టా పొంది ఉంటే మీకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.


పైన చూపించిన విధంగ వివరాలతో కనిపిస్తుంది.

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఇళ్ళ పట్టాల స్టేటస్ తెలుసుకోవచ్చు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో జూలై 12 నుండి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు