Recents in Beach

గ్రామా/వార్డ్ సచివాలయ ఉద్యోగుల జాబు పర్మనెంట్ కావాలి అంటే ఎక్షమ్ పాస్ అవ్వాల్సిందే.

 



ముఖ్య మంత్రి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామా/వార్డ్ సచివాలయ వ్యవస్థ , ఈ వ్యవస్థ ద్వార ప్రజలకు మేలైన సేవలు అందుతున్నాయి. ప్రజలు ప్రభుత్వం ద్వార ఏదైనా పని చేపించుకోవాలి అంటే కాళ్ళు అరిగేల ఆయా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కాని ఈ గ్రామా/వార్డ్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుతున్నాయి అనటంలో సందేహం లేదు.

Also Read: ఆంధ్రప్రదేశ్ లో APEAP లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామా/వార్డ్ సచివాలయానికి సంభందించి అక్టోబర్ 2, 2019 ( గాంధీ జయంతి ) రోజున 1,42,053 ఉద్యోగులను శాశ్విత ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులుగ తీసుకోవటం జరిగింది. అయితే ముందు 2 సంవత్సరాల పాటు ప్రోబిషన్ గ తీసుకుని 2 సంవత్సరాలు దాటిన తరువాత వీరిని పర్మనెంట్ ఉద్యోగులుగ తీసుకుటం అని ప్రభుత్వం వీరిని సచివాలయ ఉద్యోగులుగ తీసుకోవటం జరిగింది.

 ప్రోబిషన్ కాలంలో ఎటువంటి అలవెన్స్ లు ఉండవు. జీతం మాత్రమే వీరికి ఇవ్వటం, జీతంలో ఎటువంటి పియఫ్, ఈఎస్ఐ వంటివి ఉండవు. అయితే ఈ ఉద్యోగులు 2 సంవత్సరాలు దాటిన తరువాత అయిన మాకు మా కష్టానికి మంచి ఫలితం ఈ ప్రభుత్వం ఇస్తుంది అని ఉద్యోగులు ఎదురుచూడటం జరిగింది.

ఇప్పుడు ఈ  ప్రోబిషన్ కాలం అక్టోబర్ 2, 2021 సంవత్సరంతో ముగియనుంది కాని ప్రభుత్వం వీరికి ఒక షాకింగ్ వార్తా చెప్పటం జరిగింది అది ఏమిటంటే మీ జాబులు పర్మనెంట్ కావాలి అంటే మేము పెట్టె 2 ఎగ్జామ్స్ తప్పనిసరిగ పాస్ అవ్వాలని చెప్పటం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాల మంది షాక్ కి గురి అయ్యారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.

ఎక్షమ్ విధానం ఎల ఉంటుంది చూద్దాం :

ఈ ఎక్షమ్ఎల ఉంటుంది అనే విషయానికి వచినట్లయితే ప్రభుత్వం పధకాలకు, శాఖాపరమైన అంశాలలు మరియు డిజిటల్ సేవలకు సంభందించి ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఎక్షమ్ లో ప్రభుత్వం అనుకున్న విధంగ మార్కుల రాక ఫెయిల్ అయితే వారికి మళ్ళి ఎక్షమ్ నిర్వహించటం జరుగుతుంది అని ప్రభుత్వం చెప్పింది. అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ ద్వార ఏపిపిఎస్సి ఆధ్యర్యంలో జరుగుతాయి.

బయోమెట్రిక్ విధానం :

బయోమెట్రిక్ విధానం ఈ విధానం అనేది గ్రామా/వార్డ్ సచివాలయలో తీసుకురావటం జరిగింది. ఈ విధానం ద్వరా ఉద్యోగి ఏ సమయంలో ఆఫీసుకి వస్తున్నాడు ఏ సమయంలో సాయంత్రం ఆఫీస్ నుండి వెళ్ళుతున్నాడు అనేది రికార్డు చేయబడుతుంది. దీనిని బట్టి వారి యొక్క జీతం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగ తమ ఉద్యోగులను ఎక్కడ నుండి అయిన మోనిటరింగ్ చెయ్యటం జరుగుతుంది. ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులకు మాత్రమే జీతం ఇవ్వటం జరుగుతుంది.

ఉద్యోగుల తప్పు చేస్తే చర్యలు తప్పదు:

గ్రామా/వార్డ్ సచివాలయలోని ఉద్యోగులు, వలంటిర్స్ కాని పని నిర్వహణలో ఏమైనా అలసత్వం కనపరిచిన శాఖా పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని సియం గారు చెప్పటం జరిగింది. ప్రతి ఒక్క పనికి జవాబుదారితనం ఉండాలి. ఉద్యోగులు ఒకవేళ పని మీద బయటకి వెళ్ళాలి అంటే తమ పై అధికారికి తప్పనిసరిగ తెలియజేయాలి. ఉద్యోగిపై ఏమైనా ఆరోపణలు ఉంటే తప్పనిసరిగ విధుల నుండి తొలగించటం జరుగుతుంది.

ఇకపై మున్ముందు గ్రామా/వార్డ్ సచివాలయలో చాల కీలకమైన మార్పు తీసుకునివచ్చే అవకాశం ఉంది.

ఈ క్రిందివి కూడ చదవండి:

తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం విధ్యార్ధులకు ఎగ్జామ్స్.. వీరికి మాత్రమే

తెలంగాణాలో ఆసర పెన్షన్ వివరాలు ఎల చెక్ చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడటం లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కర్ఫ్యూ సడలింపు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు