Recents in Beach

ఓటర్ నమోదుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 



ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో 18 సంవత్సరాలు ఇంతవరకు ఓటర్ గ నమోదు కాకుండా ఉంటారో. వారందరూ ఇప్పుడు ఓటర్ నమెదు చేసుకోండి అని ఎన్నికల సంఘం చెప్పటం  జరిగింది. అలాగే ఓటర్ కార్డు లో ఉన్న డేటాని కూడ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

Also Read : వంటింట్లో మంట పెడుతున్న వంట గ్యాస్ ధరలు.

అర్హత  :

 ఓటర్ గ నమోదు చేసుకునే వారు జనవరి 1వ 2021 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిందినా లేదా ఇప్పటికే నిండిన వారు డిసెంబర్ 15వ ( చివరి తేది ) తేది నాటికి నమోదు చేసుకోమని చెప్పటం జరిగింది. అవసరం అయితే ఈ నమోదుకు చివరి తేది మార్చవచ్చు.

ధరకాస్తుకు అర్హత :

  • భారత పౌరులై ఉండాలి.
  • జనవరి 1వ 2021 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అనర్హులు :

  • ఏ సాధికారన్యాయస్తనమైన మానసిక స్థితి లేని వ్యక్తి అని ప్రకటించిన.
  • ఎన్నికలకు సంభందించి నిర్దిష్ట అవినీతి నేరాలకు పాల్పడటం వల్ల ఓటు వెయ్యటానికి అనర్హులుగ ప్రకటించిన వ్యక్తి.
ఆఫ్ లైన్ ద్వార ఎల దరకాస్తు చేసుకోవాలి :

మనం ఓటర్ నమోదుకు ఆఫ్ లైన్ ద్వార నమోదు చేసుకోవచ్చు ఎల నమోదు చేసుకోవచో ఇప్పుడు చూద్దాం.

ఎలేక్ట్రోలర్ రిజిస్టర్ ఆఫీసర్ ( ఇఆర్ఓ ), బూత్ లెవల్ ఆఫీస్ ( బియల్ఓ ) దగ్గర అన్ని రకాల ధరకాస్తూ ఫారాలు లభిస్తాయి లేదా www.eci.nic.in అనే వెబ్ సైట్ ద్వార ఫారాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సంభందిత ఫారాలు నింపి, ఫోటో అతికించి, వయస్సు, చిరునామా పత్రాలు జత చేసి ధరకాస్తూ చేసుకోవాలి.

ఓటర్ నమోదు కేంద్రలో కుడా ధరకాస్తులు ఉంటాయి అక్కడ కూడ ధరకాస్తూ నింపి సమర్పించవచ్చు.

ఆన్లైన్ ద్వార ఎల దరకాస్తు చేసుకోవాలి :

నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ( NVSP ) www.nvsp.in వెబ్ సైట్ లోకి అప్లై చేసుకోవాలి.

ముందు రిజిస్టర్ చేసుకోవాలి తరువాత సంభందిత ఫారం 6 లోకి వెళ్లి, పేరు, వయస్సు, చిరునామా, నివాస దృవీకరణ వివరాలు నింపి, ఆ పత్రాలకు సంభందించిన ప్రూఫ్ లు అప్లోడ్ చెయ్యాలి.

ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలి అంటే దానికి సంభందించి ఫారం లోకి వెళ్లి అవి నింపి దానికి సంభందించిన పత్రాను, ప్రూఫ్ లు అప్లోడ్ చెయ్యాలి.

Also Read : పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.

ఫారంలు :

ఏ యే ఫారం లు దేనికి ఉపయోగపడతాయో చూద్దాం.

ఫారం 6 : 

కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవటానికి, చిరునామా ఒక నియోజక వర్గం నుండి మరో నియోజక వర్గానికి మార్చుకోవటానికి ఈ ఫారం నింపాలి.

ఫారం 6A : 

భారతీయ పాస్ పోర్ట్ కలిగి విదేశాలలో ఉన్న భారతీయుల కోసం ఈ ఫారం.

ఫారం 7 : 

ఓటర్ జాబితాలో ఉన్న పేరు తొలగించటానికి, ఓటర్ జాబితాలో పేరు చేర్చటానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపటానికి.

ఫారం 8 : 

ఓటర్ జాబితాలలో ఎంట్రిలలో మార్పు లేదా దిద్దుబాటు కొరకు

గమనిక : పై ఫారంలు నింపిన తరువాత తప్పని సరిగ ప్రూఫ్ సబ్మిట్ చెయ్యాలి.

హెల్ప్ లైన్ నంబర్స్ :

దీనికి సంభందించి ఏమైనా సందేహాలు ఉంటే 1950 కి కాల్ చెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :









 









కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు