Recents in Beach

ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.

 



ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో మెర్జి చెయ్యటం జరిగింది. ఈ విషయం అందరికి తెలిసిందే అయితే అయితే ఈ విషయమై ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులకు చాల డౌట్స్ ఉన్నాయి.

Also Read : మీ ఆధార్ నంబర్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి.

అవి ఏమిటంటే మనలో స్కాలర్ షిప్ తీసుకునే వారు, పెన్షన్ తీసుకునే పెద్ద వారు, ఈ బ్యాంకు లో డిపాజిట్లు ఉన్న పేద వారు, అలాగే మామూలు ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులకు ఒక పెద్ద డౌట్ అయితే ఉంది అది ఏమిటంటే మనకు బ్యాంకు మారింది కదా ఎకౌంటు నంబర్ మారుతుందా, పాస్ బుక్ మార్చుకోవాల, చెక్ బుక్ లు పనిచేస్తాయా ? పని చేయ్యావా ?, యూపిఐ పేమెంట్ కి సంభందించి ఆంధ్రాబ్యాంక్ యాప్ పని చేస్తుందా ? పని చేయ్యాదా ? అలగే ఇంటర్ నెట్ బ్యాంకు కు సంభందించి పాస్ వర్డ్ పని చేస్తుందా ? పని చెయ్యదా, మీ దగ్గర ఉన్న ఏటియం కార్డ్స్ పై చేస్తాయా ? చేయ్యావా ? వంటి డౌట్స్ చాల మంది మదిలో ఉన్న ప్రశ్నలు.

ఎకౌంటు నంబర్ :

బ్యాంకు అయితే మారింది కాని మీ ఎకౌంటు నంబర్ మాత్రం ఏమాత్రం మారలేదు. ప్రస్తుతం ఉన్నవే కంటిన్యూ అవుతాయి. ఇకపై ఈ ఎకౌంటు నంబర్ యూనియన్ బ్యాంకు ఎకౌంటు నంబర్ గ కంటిన్యూ అవుతాయి. 

పాస్ బుక్ :

పాస్ బుక్ మార్చుకుంటే మార్చుకోవచ్చు లేదా ప్రస్తుతం వాడే పాస్ బుక్ వాడుకోవచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద లవాదెవీలు చెయ్యాలంటే తప్పకుండ పాస్ బుక్ మార్చుకోవాలి. సాదారణ ఖాతాదారులు పాస్ బుక్ మార్చుకుంటే మార్చుకోవచ్చు మార్చుకోక పాయిన ఫర్వాలేదు.

ఐయఫ్ఎస్సి కోడ్ మరియు బ్రాంచ్ కోడ్ :

ఐయఫ్ఎస్సి కోడ్ మరియు బ్రాంచ్ కోడ్ ఇప్పటికే మారిపోయాయి ఇవి మొబైల్ ఎస్ యం ఎస్ రూపంలో అందరి చేరిపోయాయి. ఒకవేళ మీకు మొబైల్ ఎస్ యం ఎస్ రాకపొతే బ్రాంచ్ వెళ్లి తెలుసుకోండి. పాతవి ( అంటే ఆంధ్రాబ్యాంక్ ఐయఫ్ఎస్సి కోడ్ మరియు బ్రాంచ్ కోడ్ ) మార్చ్ 31 2021 వరకు మాత్రమే పని చేస్తాయి.

Also Read : వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

ఆంధ్రాబ్యాంక్ యాప్స్ :

ఆంధ్రాబ్యాంక్ కు సంభందించి డేటా మొత్తం అప్ గ్రేడ్ అవుతుంది. ఇది ఫిబ్రవరి 1 వరకు అప్ గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ వారం రోజులు యప్ వాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటె బ్యాంకు లో డబ్బులు కట్ అవుతున్నాయి కాని వేరే వారికి చేరటం లేదు వారం రోజులు యప్ వాడకుండా ఉండటం మంచిది.

చెక్ బుక్స్ :

చెక్ బుక్ విషయానికి వస్తే పాత చెక్ బుక్స్ ఈ మార్చ్ 31 వరకు పని చేస్తాయి. తరువాత పని చేయ్యావు.

ఏటియం కార్డు క్రెడిట్ కార్డులు :

డెబిట్ కార్డు లు క్రెడిట్ కార్డు లు పని చేస్తాయి కాని ఇవి ఎక్ష్పపైరి డేట్ ఉన్నంత వరకు మాత్రమే పని చేస్తాయి. ఎక్ష్పపైరి డేట్ దాటిన తరువాత పని చెయ్యవు. అప్పుడు కొత్త యూనియన్ బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్లను వాడవలసి ఉంటుంది.

ఇంటర్నెట్ ఐడి పాస్ వర్డ్ :

ఇంటర్నెట్ ఐడి పాస్ వర్డ్ లు ఈ మార్చ్ 31 2021 వరకు మాత్రమే పని చేస్తాయి. ఏప్రిల్ నుండి కొత్త ఐడి పాస్ వర్డ్ లు తీసుకోవాలి.

Conclusion :

పైన మీరు ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఏమిటో తెలుసుకున్నారు. దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.

అమ్మ ఒడి పేమెంట్ ( డబ్బులు వచ్చాయా లేదా ) ఎల చెక్ చేసుకోవాలి.

ఫిబ్రవరి 1వ తేది నుండి తెలంగాణాలో బడులు ప్రారంభం.

ఈ రోజే తల్లుల బ్యాంకు ఖాతాలోకి అమ్మ ఒడి డబ్బులు జమ.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుండి రెండు పూటలా బడులు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు